పైన ఫోటోలో కనిపిస్తోన్న ఈ చిన్నారి అమ్మాయి అనుకుంటే పొరపాటే. ఎంతో క్యూట్‌గా కనిపిస్తోన్న ఆ బుజ్జాయి నిజానికి అబ్బాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని..ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈరోజు ఆ హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. గుర్తుపట్టారా ?.. మీకోసం మరో క్లూ. ఈ చిన్నారి ముగ్గురు మావయ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్. ఇప్పుడు గుర్తుపట్టే ఉంటారు. తను సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈరోజు ఆయన (అక్టోబర్ 15న) పుట్టినరోజు. ఈ సందర్భంగా తేజ్ చిన్ననాటి ఫోటోస్, రేర్ పిక్స్ నెట్టింట షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్.
1987 అక్టోబర్ 15న జన్మించాడు సాయి ధరమ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు విజయదుర్గ తనయుడు. చిన్నప్పటి నుంచి నటనపై ఇష్టంతో హీరోగా అడుగుపెట్టారు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తొలిసారి వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సూప్రీమ్, తిక్క వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో హీరోగా దూసుకుపోతున్న తరుణంలోనే అనుకోని ప్రమాదం తేజ్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది.
View this post on Instagram
గతేడాది సెప్టెంబర్ 10న దుర్గం చెరువు వద్ద బైక్ మీద ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించగా.. చాలా రోజులపాటు అపస్మారక స్థితిలోనే ఉన్నాడు తేజ. అప్పట్లో తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున పూజలు కూడా చేశారు. అయితే ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత చాలా రోజులపాటు తేజ్ ఎంతో ఇబ్బంది పడ్డాడు. సరిగ్గా మాట్లాడేందుకు కొన్నిరోజులపాటు ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత చాలాకాలం గ్యాప్ తీసుకుని విరూపాక్ష సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తేజ్ కు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పాలి. సంయుక్త మీనన్, తేజ్ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాపీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం తేజ్ తన కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.