వారాంతం వచ్చిందంటే చాలు బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్స్ హంగామా మొదలవుతుంది. ఇక ఈవారం కూడా ఊహించని ఎలిమినేషన్ జరిగింది. గతవారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. ఈ ఏడుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. నిన్న సండే కావడంతో ఫన్ డే అంటూ ఆటలాడించారు నాగార్జున. ఇక నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒక్కకారిని సేవ్ చేస్తూ వచ్చారు. గత వారం నామినేషన్స్ లో శోభా శెట్టి, టేస్టీ తేజా, నయని పావని, అమర్ దీప్, పూజా మూర్తి, అశ్విని శ్రీ, ప్రిన్స్ యావర్ ఉన్నారు. వీరిలో ఒకొక్కరిని సేవ్ చేసిన నాగార్జున చివరకు అశ్విని, నయని పావని యాక్టివిటీ రూమ్ కు రమ్మన్నాడు. దాంతో అశ్విని ముందుగానే ఏడ్చేసింది. లోపాలకి రమ్మంటే నేను ఎలిమినేట్ అయ్యిపోతానేమో అంటూ భయపడి కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో హౌస్ లో ఉన్న వారు దైర్యం చెప్పి లోపలి పంపించారు.
ఆతర్వాత ఇద్దరి ముందు రెండు ఫిష్ బౌల్స్ ఉంచారు. ఆ పక్కనే రెండు బాటిల్స్ ఉంచి ఆ బాటిల్స్ లోని లిక్విడ్ ను బౌల్ లో పోయాయలని చెప్పాడు. ముందుగా ఇద్దరి బౌల్స్ రెడ్ కలర్ లోకి మారాయి. ఆ తర్వాత బౌల్స్ లో లిక్విడ్ పోయగా.. నయని పావని బౌల్ రెడ్ కలర్ లోనే ఉండగా.. అశ్విని బౌల్ తిరిగి ఎల్లో కలర్ లోకి వచ్చింది. దాంతో అశ్విని సేవ్ అయ్యిందని తెలిపి.. నయని పావని ఎలిమినేట్ అని అనౌన్ చేశారు నాగార్జున.
ఇక నయని పావని ఎలిమినేట్ అని నాగార్జున అనౌన్స్ చేయడంతో అశ్విని ఊపిరి పీల్చుకుంది. కాస్త ఎమోషనల్ కూడా అయ్యింది. ఇక నయని పావని వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పట్లో గీతూ రాయల్ ఎలా అయితే ఏడ్చిందో అదే రేంజ్ లో ఏడ్చింది నయని పావని. ఈ చిన్నది వచ్చిన వారం రోజులకే హౌస్ కు గుడ్ బై చెప్పేసింది. నయని పావని కన్నీళ్లు పెట్టుకోవడమతొ హౌస్ మొత్తం ఎమోషనల్ అయ్యారు. నేను గేమ్ బాగా ఆడలేదా..? అని ఏడ్చేసింది నయని పావని. బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కరి గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది నయని పావని.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.