బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత నటి రియా చక్రవర్తి పేరు ఎక్కువగానే వినిపించింది. సుశాంత్ సింగ్ మరణానికి అతని మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి కారణమని, రియా చక్రవర్తిని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి కొంతమంది నెటిజన్స్ రచ్చ చేశారు. ఇంతలో, సుశాంత్ సింగ్ మరణం కారణంగా బయటపడిన డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి జైలుకు కూడా వెళ్ళింది. దాదాపు నెల రోజుల పాటు రియా జైల్లో ఉంది. పాత చేదు జ్ఞాపకాల నుంచి కోలుకుని ఇటీవల సామాజిక జీవితంలోకి వచ్చిన రియా చక్రవర్తి, మొదటిసారిగా జైలులో గడిపిన రోజుల గురించి బహిరంగంగా మాట్లాడింది.
దీని గురించి ఓ టాక్ షోలో మాట్లాడిన రియా చక్రవర్తి.. ‘మనం అక్కడ కేవలం ఒక నంబర్ మాత్రమే, నిన్ను సమాజానికి దూరంగా ఉంచి ఓ నంబర్ వదిలేస్తారు. మనం సమాజంలో ఉండడానికి తగినది కాదు కాబట్టి మనం ఒంటరిగా ఉన్నాము అని అర్ధమవుతుంది. అక్కడే మనకున్న అహం అంతా చచ్చిపోతుంది. నేను అండర్ ట్రయల్స్ జైలులో ఉన్నాను. నాలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. వారు కూడా అండర్ ట్రయల్ ఖైదీలే” అని రియా తెలిపింది.
“వాళ్ళను చూడటం, వారితో సంభాషించడం, వారితో మాట్లాడటం అలాగే వారితో ఆడుకోవడంతో నేను వారిలోని అద్భుతాలను చూశాను. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ప్రతి క్షణాన్ని ఎలా ఆస్వాదించాలో వారి నుంచి నేర్చుకున్న. చిన్న చిన్న విషయాల్లో కూడా సంతోషం వ్యక్తం చేసేవారు. ఆదివారాలు సమోసాలు వడ్డిస్తారని చాలా సంతోషించే వారు..వాటి కోసం ఎదురు చూసేవాళ్ళం” అని రియా చెప్పింది.
ఆ సమయం నా జీవితంలో అత్యంత బాధాకరమైన సమయం. అయితే స్వర్గం, నరకం అన్నీ మనం అనుకున్నట్లే ఉంటాయి. ఏ పరిస్థితినైనా స్వర్గం అనుకుంటే స్వర్గం, నరకం అనుకుంటే నరకం. ప్రతిసారీ స్వర్గాన్ని ఊహించడం కష్టం, కానీ నిరంతర ప్రయత్నంతో మీరు ఈ మనస్సు చేసే యుద్ధంలో విజయం సాధించవచ్చు” అని చెప్పుకొచ్చింది రియా చక్రవర్తి చెప్పారు. సుశాంత్ సింగ్‌కు డ్రగ్స్ ఇచ్చిన ఆరోపణలపై రియా చక్రవర్తి జైలుకు వెళ్లింది. నెల రోజులు జైలు జీవితం గడిపి బెయిల్‌పై విడుదలైంది. ఆమె సోదరుడు కూడా ఇదే కేసులో జైలు శిక్ష అనుభవించాడు. సుశాంత్ సింగ్ మరణానంతరం వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులను కూడా విచారించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.