Most Recent

Bigg Boss 7 Telugu: అబ్బే.. ఈమె ఇంకా మారలే..! ప్రిన్స్, శోభ.. పిచ్చి పంచాయితీ..

Bigg Boss 7 Telugu: అబ్బే.. ఈమె ఇంకా మారలే..! ప్రిన్స్, శోభ.. పిచ్చి పంచాయితీ..

ఇవ్వాళ్టి బిగ్ బాస్ ఎపిపోడ్ మొదలవడే రతిక, ప్రశాంత్ మధ్య జరుగుతున్న ఎమోషనల్ అండ్ డ్యామేజ్ డిస్కషన్‌తో మొదలవుతుంది. తనను అక్కా పిలవకని రతిక.. లేదు నేను అక్కా అనే పిలుస్తా అని పల్లవి ప్రశాంత్.. ఇద్దరూ వాదించుకోవడం.. ఒకరిని చూసి ఇంకొకరు ఏడవడంతోనే ఎపిపోడ్ 15 నిమిషాలు ముగుస్తుంది. అయితే వీళ్ల మధ్యలోకి వచ్చిన శివాజీ పెద్ద మనిషిలా.. ప్రశాంత్‌కు సలహా ఇస్తాడు. ‘నువ్వు రతికను అక్కా అంటే.. బయట వేరేగా పోతుంది. కాబట్టి అక్కా అనకు. హౌస్‌లో ఉండేంత వరకు ఇలా ఉండు.. బయటికి వెళ్లాక నీ ఇష్టం’ అంటూ చెబుతాడు. దీంతో శివాజీ మాటలను సీరియస్‌గా తీసుకునే అలవాటున్న ప్రశాంత్… రతికను.. అక్క అనే బదులు రతిక అనే పిలుస్తా అంటాడు. అందుకు రతిక కూడా మనం ఫ్రెండ్స్ అంటూ.. హగ్ ఇస్తుంది. అయితే ఎందుకో మళ్లీ ఈమె తన గేమ్‌.. ప్రశాంత్‌తోనే షురూ చేసినట్టు అనిపిస్తుంది. ప్రిన్స్ యావర్‌తో కంటిన్యూ చేస్తున్నట్టు.. శివాజీని షాడో కోసం ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి ఈమె మారనట్టు సగటు బీబీ ఆడియెన్స్‌కు కనిపిస్తుంది.

ఇక ఆ తరువాత సీన్లో.. ప్రిన్స్ యావర్‌తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది రతిక. దీంతో వీళ్లిద్దరి మధ్య జోడీ సెట్ అయిందనే డౌట్స్ రిమైనింగ్ హౌస్‌ మేట్స్‌లో కలుగుతుంది. దాంతో పాటే.. పల్లవి ప్రశాంత్ లానే.. ప్రిన్స్ యావర్ పరిస్థితి కూడా అవుతుందనే అనుమానం.. తేజ లాంటి మాదాపూర్ జీనియస్ మెదడులో పుడుతుంది కూడా…!

ఇక వీళ్ల ఎపిసోడ్ పక్కకు పెడితే.. బిగ్ బాస్ అసలైన ఎపిపోడ్‌ను స్టార్ట్ చేస్తాడు. కెప్టెన్సీ కంటెడర్స్‌గా నిలిచిన ప్రియాంక, శోభ, ప్రశాంత్, గౌతమ్‌, సందీప్‌లలో ఒకరిని కెప్టెన్‌గా ఎన్నుకునే టైం వచ్చిందంటూ.. హౌస్‌ మేట్స్ ముందు ఒపీనియన్ పోల్ పెడతాడు. ఇక దాని ప్రకారం.. కెప్టెన్‌గా ఎవరు అన్‌ డిసర్వో.. వారి మెడలో ఎండు మిరపకాయ దండ వేయాలని కంటెస్టెంట్స్‌కు చెబుతాడు. ఒక్కక్క హౌస్‌ మేట్ వచ్చి సరైన రీజన్‌ చెప్పి.. తాము అనుకున్న అన్‌డిసర్వింగ్ కంటెండర్ మెడలో ఆ దండను వేయాలని..నిర్దేశిస్తాడు. చివరగా ఎండు మిరపకాయ దండ పడకుండా ఎవరైతే ఉంటారో వారే ఈ వారం కెప్టెన్ అంటూ.. సభ్యులకు అర్థం అయ్యేట్టు చెబుతాడు.

ఇక వాడీ వేడీగా జరిగిన ఈ టాస్కులో.. అమర్ దీప్.. పల్లవి ప్రశాంత్ మెడలో మిర్చి దండ వేస్తాడు. అమర్ చెప్పిన రీజన్ నచ్చకపోవడంతో.. మీసం తిప్పి తొడకొడతాడు ప్రశాంత్. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరుగుతుంది. ఇక ఆ తరువాత రౌండ్‌లో వచ్చిన తేజ కూడా ప్రశాంత్‌కే మిర్చి దండ వేస్తాడు.

ఇక తరువాత వచ్చిన ప్రిన్స్ యావర్.. శోభను అన్‌డిసర్వింగ్ అంటూ… తన మెడలో మిర్చి దండ వేసేందుకు నిర్ణయం తీసుకోగా.. శోభ ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. మాటలతో ప్రిన్స్ మీద దాడి చేసినంత పని చేస్తుంది. దీంతో సహనం కోల్పోయిన యావర్ .. తన స్టైల్ ఆఫ్ మాటలతో ఎదురుదాడికి దిగుతాడు. దీంతో శోభ, ప్రిన్స్‌ను పిచ్చోడంటూ కామెంట్ చేస్తుంది. ఇక ఈ ఒక్క మాటతో టెంపర్ కోల్పోయిన యావర్.. శోభ మీదికి వెళతాడు. ఇద్దరూ కొట్టుకుంటారా ఏంటనేలా బిహేవ్ చేస్తారు. అయితే కెప్టెన్గా ఉన్న అర్జున్, పెద్ద మనిషి శివాజీ మధ్యలోకి రావడంతో.. వీరిద్దరూ కాస్త దూరంగా వెళతారు.

ఇక తరువాత వచ్చిన భోళె ప్రియాంకను.. అన్‌డిసర్వ్‌డ్ కెప్టెన్సీ కంటెండర్‌గా నామినేట్ చేస్తాడు. తర్వాత వచ్చిన అశ్విని కూడా అదే చేస్తుంది. ప్రియాంకనే నామినేట్ చేస్తుంది. ఇక ఆ తరువాత వచ్చిన రతిక.. శోభను నామినేట్ చేస్తుంది. దీంతో శోభ ప్రిన్స్‌ను ఫాలో అవుతున్నావ్ అంటూ.. మళ్లీ రతికతో వాగ్వాదానికి దిగుతుంది.

ఇక ఆ తరువాత వచ్చిన అర్జున్.. సందీప్‌ను అన్‌డిసర్వ్‌డ్ కెప్టెన్సీ కంటెడర్‌గా నామినేట్ చేస్తాడు. ఆ తరువాత వచ్చిన శివాజీ అర్జున్‌కే తన సపోర్ట్ అంటూ.. చెప్పి సందీప్‌నే నామినేట్ చేస్తాడు. దీంతో డాక్టర్ బాబు అర్జున్ ఈ వారం కెప్టెన్‌గా ఎన్నికవుతాడు. అర్జున్ నుంచి కెప్టెన్సీ బ్యాడ్జ్‌ ను అందుకుంటాడు.

 

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.