ప్రతీ సీజన్‌లో మాత్రమే కాదు.. ప్రతీ ఎపిసోడ్‌లోనూ.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరిలో.. ఎవరో ఒకరు హైలెట్ అవుతూనే ఉంటారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7.. ఇవ్వాళ్టి అంటే 54th ఎపిసోడ్‌లోనూ ఒకరు ఎపిసోడ్ మొత్తంలో హైలెట్ అయ్యారు. గయ్యాలి గంపరా బాబు అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు. తన నోరుతో.. దానికున్న పవర్‌తో .. అందర్నీ హడలెత్తించారు. చూడ్డానికి పీలగా ఉన్నా టాస్కుల్లో అదరగొట్టి అందర్నీ అట్రాక్ట్ చేశారు. ఆమె ఎవరో కాదు.. కార్తీక దీపం మోనిత అలియాస్ శోభ.
సీరియల్ బ్యాక్‌డ్రాప్ నుంచి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన శోభ.. బిగ్ బాస్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి.. తన గడుసుతనం చూపిస్తూనే ఉన్నారు. అటు అన్ని టాస్కుల్లో అదరగొడుతూ… ఇటు తన అందంతో షోకి గ్లామర్ తీసుకొచ్చారు. అలాంటి శోభ.. తాజా ఎపిపోడ్‌లో కెప్టెన్సీ కంటెండర్గా.. బీబీ మారథాన్‌లో ఫైనల్ కు చేరుకున్నారు. కెప్టెన్ పొజీషన్‌కు ఇంకొక్క అడుగు దూరంలోనే ఉన్నారు. అందుకోసం గయ్యాలి వేషం వేశారు. అందర్నీ భయపెట్టి మరీ నెంబర్ ఆఫ్ టాస్కుల్లో ఆడారు.
ఇక అర్జున్ తర్వాత హౌస్‌లో మరో కెప్టెన్‌ను సెలక్ట్ చేయాలనుకున్న బిగ్ బాస్… ఈ సారి బీబీ మారథాన్ అంటూ.. సెట్ ఆఫ్ గేమ్స్‌ను ఇంట్లోని సభ్యుల ముందు ఉంచారు. ఒక్కోసారి కెప్టెన్ డిసైడ్ చేసిన.. నలుగిరి మధ్యలో గేమ్ పెడుతున్న బిగ్ బాస్.. అందులో గెలిచిన వాడిని కెప్టెన్సీ కంటెడర్‌గా ఫైనల్ చేస్తూ… మరో టాస్క్‌కు క్వాలిపై అయ్యేలా చేస్తున్నాడు. ఓడిపోతే కెప్టెన్సీ కంటెడర్స్ నుంచి తొలిగించేస్తున్నాడు.
ఇక ఈక్రమంలోనే ఇవ్వాళ్టి ఎపిసోడ్‌లోనూ.. బీబీ మారథానే కంటిన్యూ అయింది. ఇక ఇందులో భాగంగా.. చాలా వినూత్నంగా ఉండే మూడు టాస్కులను హౌస్ మేట్స్ మధ్య పెడతాడు బిగ్ బాస్. ఇక అందులో మొదటి గేమ్ కోపం అర్జున్, సందీప్, భోళె, అశ్విని రంగంలోకి దిగగా.. వీరికి ఓ ఇంట్రెస్టింగ్ టాస్క్ పెడతాడు బిగ్ బాస్.
ఇక ఈ పోటీలో పాల్గొనే నలుగురు హౌస్ మేట్స్ .. తల పై ఫోమ్ క్యాప్ ఉంటుందని.. లాన్‌లో ఉన్న షవర్ నుంచి బజర్ మోగగానే నీళ్లు వస్తాయి. అయితే అలా వచ్చిన నీటిని తమ తమ తలపై ఉన్న ఫోమ్ క్యాప్‌తో క్యాచ్ చేసి.. ఆ నీళ్లను తమ పేరుతో ఉన్న టబ్లో నింపాలని చెబుతాడు. అయితే ఇందులో ఎవరు ఎక్కువ నీళ్లు సేకరిస్తే వాళ్లే నెక్ట్స్ గేమ్‌కు వెళతాడని.. చెబుతాడు.
ఇక ఈ గేమ్లో బలిష్టంగా ఉన్న అర్జున్ మొదట్లో కాస్త లీడ్ సాధిస్తాడు. తన బలంతో.. అశ్విని ఓ రేంజ్లో తోసి పడేస్తాడు. సందీప్‌ను , భోళెను ఒంటి చేత్తో హ్యాండిల్ చేస్తుంటాడు. ఇక బజర్ మోగిన తరువాత వీళ్లు కలెక్ట్ చేసిన నీటిని కొలిచిన సంచాలక్ శివాజీ.. బోళెను ఆట నుంచి తొలగిస్తాడు. దీంతో భోళె తను కలెక్ట్ చేసిన నీటిని అశ్విని బాక్సులో పోస్తాడు. దీంతో అశ్విన గెలుస్తుందనే డౌట్ అందర్లో కలుగుతుంది. కానీ కట్ చేస్తే ఆ తరవాత బజర్ మోగగానే నీళ్లు తక్కువగా ఉన్న కారణంగా తనే బయటికి వస్తుంది. అలా వస్తూ వస్తూ.. తను ఇప్పటి వరకు సేకరించిన నీటిని సందీప్ బాక్సులో పోస్తుంది. దీంతో సందీప్ ఈ టాస్క్‌లో గెలవడం అఫీషియల్ అవుతుంది.
ఇక ఈ గేమ్ తర్వాత మరో గేమ్ పెట్టిన బిగ్ బాస్.. వాళ్ల వాళ్ల ముందు బాక్సుల్లో ఉన్న బాల్స్‌ను ఒంటిచేత్తో.. ఖాళీ చేయాలని..బాల్స్‌ను వేగంగా ఖాళీ చేసి.. ఎవరు ముందుగా గంట కొడతారో వారే విజేతలంటూ చెబుతాడు. అప్పటికే బీబీ మారథాన్‌లో ఓ గేమ్ ఆడిన శోభ.. ఈ గేమ్లో తాను పార్టిసిపేట్ చేస్తా అంటూ పట్టబడుతుంది. కాస్త మొండిగా బిహేవ్ చేస్తుంది. గయ్యాలి గంపలా.. బిహేవ్ చేస్తుంది. ఏడుస్తూ.. అరుస్తూ.. తనను తాను సెల్ఫ్ ఎంకరేజ్ చేసుకుంటూ.. కొత్తగా కనిపిస్తుంది. ఇవి చూడలేక ఈ టాస్కులో శోభకు మరో ఛాన్స్ ఇస్తాడు అర్జున్. అందుకు నామినేషన్స్‌లో ఉన్న వాళ్లనే .. ఈ టాస్క్‌లో భాగస్వామ్యం చేస్తున్నా అంటూ.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న గౌతమ్, అశ్విని, శోభ, అర్జున్, శివాజీని గేమ్ కోసం ఎన్నుకుంటాడు.
ఇక టాస్క్‌ను శోభ కొద్దిలో చేజార్చుకుంది. దీంతో అర్జున్ క్షణంలో శోభ కంటే ముందే బెల్ కొట్టి విజేత అవుతాడు. కెప్టెన్సీ కంటెడర్స్ లిస్టులోకి ఎక్కేస్తాడు. శివాజీ ఓడిపోయి.. గేమ్ నుంచి బయటికి వస్తాడు.
ఇక ఆ తరువాత పెట్టిన మరో టాస్కులో మరో సారి శోభ, తేజ, ప్రిన్స్ యావర్ పార్టిపిపేట్ చేస్తాడు. శోభకు సాయకురాలిగా ప్రియాంక, తేజకు అమర్, ప్రిన్స్ యావర్‌కు రైతు బిడ్డ సాయకులుగా ఉంటారు. ఇక ఈ గేమ ఏంటంటే,.. బజర్ మోగినప్పటి నుంచి.. బజర్ మరో సారి మోగే వరకు.. ఎవరు ఎన్ని బట్టలు వేసుకుంటారో వాళ్లే విజేతలంటూ అనౌన్స్ చేస్తారు. ఇక ఈ టాస్కులో దాదాపు 72 బట్టలను తన ఒంటి మీద వేసుకుని విన్నర్ అవుతుంది. ప్రిన్స్ యావర్ రన్నర్ అవుతాడు.
ఇక ఈ టాస్కులు పక్కకు పెడితే.. శోభ.. గేమ్ ఓడిపోయిన ప్రతీ సారి చాలా ఎమోషనల్ అయింది. గేమ్‌లో ఎవర్నీ ఆడించాలనే డిస్కషన్ను, కెప్టెన్ తీసుకొచ్చిన ప్రతీ సారి.. అర్జున్ తో గొడవ పడింది. తానే ఆడతా అంటూ మారం చేసేంది. తేజ పై కూడా సీరియస్ అయింది. కెప్టెన్ అర్జున్‌నే బెదిరించింది. హౌస్‌లో తనకు.. తన నోరుకు అందరూ భయపడేలా చేసుకుంది.
– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..