-
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సోమవారం (అక్టోబర్ 23) పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డార్లింగ్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక డార్లింగ్ అభిమానులంతా తమ హీరో బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
-
ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జపాన్‌లో డార్లింగ్‌కు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.
-
ప్రభాస్ కోసమే జపాన్ నుంచి హైదరాబాద్ కు చాలా సార్లు చాలా మంది అభిమానులు ప్రత్యేకంగా వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
-
ఇక ప్రభాస్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు జపాన్‌లోని డార్లింగ్ ఫ్యాన్స్. ఒక రూమ్ మొత్తాన్ని ప్రభాస్ ఫొటోలు, పోస్టర్లతో నింపేశారు. అలాగే డార్లింగ్ కటౌట్లు, ఫొటోలకు పూలదండలు వేసి, ప్రసాదాలు పెట్టి ఒక పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు.
-
ప్రస్తుతం డార్లింగ్ బర్త్ డేకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.