Most Recent

Bigg Boss 7 Telugu: పూజా మూర్తికి షాకింగ్ రెమ్యునరేషన్.. 2 వారాలకు ఎంత తీసుకుందో తెలుసా?

Bigg Boss 7 Telugu: పూజా మూర్తికి షాకింగ్ రెమ్యునరేషన్.. 2 వారాలకు ఎంత తీసుకుందో తెలుసా?

అంతా అనుకున్నదే అయ్యింది. ఏడో వారం కూడా అమ్మాయే బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది. ఐదో వారంలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన పూజా మూర్తి రెండు వారాలకే ఎలిమినేట్‌ అయింది. సెప్టెంబర్‌ 3 న ప్రారంభమైన బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ఏడు వారాలు పూర్తి చేసుకుంది. అయితే ఈ ఏడు వారాల్లోనూ మహిళలే ఎలిమినేట్‌ కావడం గమనార్హం. ఇప్పటికే కిరణ్‌ రాథోడ్‌, షకీలా, దామిని భట్ల, రతికా రోజ్‌, శుభ శ్రీ, నయని హౌజ్‌ నుంచి బయటకు వెళ్లి పోగా తాజాగా పూజా మూర్తి కూడా ఎలిమినేట్‌ అయ్యారు. ఈ సీరియల్‌ నటి మొదటగానే బిగ్ బాస్ హౌజ్‌ లోకి అడుగుపెట్టాల్సి ఉండేది. అయితే హఠాత్తుగా తండ్రి మరణించడంతో హౌజ్‌లోకి రాలేకపోయింది. అయితే బిగ్‌ బాస్‌ 2.ఓలో వైల్డ్ కార్డ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఇక పూజా మూర్తి ఎలిమినేషన్‌కు కారణాలు చాలానే ఉన్నాయి. హౌజ్‌లోకి రావడం రావడమే సీరియల్ బ్యాచ్‌తో కలిసిపోయింది. తన గ్రూప్‌లోని మరో కంటెస్టెంట్‌ అశ్విని శ్రీతో అనవసరంగా గొడవలు పెట్టుకుంది. ఇక టాస్కులు, ఆటల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

అందుకే ఎలిమినేట్..

ఇక ఏడో వారం నామినేషన్స్‌ డేంజర్‌ జోన్‌లో సింగర్‌ భోలే షా వళి, అశ్విని, పూజా మూర్తి ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చిన పూజా హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. మొత్తానికి బిగ్‌ బాస్‌లో వచ్చిన రెండు వారాలకే బయటకు వెళ్లిపోయిందీ సీరియల్‌ నటి. ఇదిలా ఉంటే పూజా మూర్తి బిగ్‌ బాస్‌లో అందరి కంటే తక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు వారాలకు కలిపి కేవలం రూ. 3 లక్షలు మాత్రమే తీసుకుందట. అంటే లెక్కన రూ.1.5 లక్షలు మాత్రమే ఇచ్చారట. తద్వారా బిగ్‌ బాస్‌లో అతి తక్కువ రెమ్యునరేషన్‌ తీసుకున్న కంటెస్టెంట్‌గా పూజా మూర్తి నిలిచింది.

బిగ్ బాస్ హౌజ్ లో పూజా మూర్తి..

 

View this post on Instagram

 

A post shared by Pooja Murthy (@pooja.murthy.official)

వరుసగా ఏడో వారం కూడా అమ్మాయినే..

అతి తక్కువ రెమ్యునరేషన్..

 

View this post on Instagram

 

A post shared by STAR MAA (@starmaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.