Most Recent

Bigg Boss 7 Telugu: గరం గరంగా నామినేషన్స్.. శివాజీకి ఇచ్చిపడేసిన శోభా శెట్టి..

Bigg Boss 7 Telugu: గరం గరంగా నామినేషన్స్.. శివాజీకి ఇచ్చిపడేసిన శోభా శెట్టి..

బిగ్ బాస్ లో నామినేషన్స్ రచ్చ మొదలైంది. ఆదివారం ఎపిసోడ్ లో ఊహించని విధంగా పూజా మూర్తి హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. గతవారం నామినేషన్స్ లో పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే చాలా మంది భోలే హౌస్ నుంచి బయటకు వెళ్తాడని అందరు అనుకున్నారు. కానీ పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. భోలే ఎలిమినేట్ కాకపోవడంతో శోభా శెట్టి షాక్ అయ్యింది. ఇక సోమవారం నామినేషన్స్ షురూ చేశారు బిగ్ బాస్. ఈ నామినేషన్స్ లో మరోసారి రచ్చ జరిగింది. హౌస్ మేట్స్ ఒకరి పై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా హౌస్ లో పెద్దమనిషి శివాజీ పై శోభా శెట్టి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే భోలే మరోసారి తన వెటకారంతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించారు.

నిన్నటి ఎపిసోడ్ లో భోలే లాజిక్ లేకుండా మాట్లాడి ఇరిటేట్ చేశాడు. ఇక ఈ వారం నామినేషన్ శివాజితో మొదలు పెట్టారు. శివాజి శోభా శెట్టి, ప్రియాంకను నామినేట్ చేశాడు. భోలే తో జరిగిన గొడవ తనకు నచ్చలేదు అని ఈ ఇద్దరినీ నామినేట్ చేశాడు శివాజీ. భోలే పెద్దోడు కదా .. సారి చెప్పిన తర్వాత కూడా అతనితో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని అన్నాడు శివాజీ.

ఆతర్వాత శోభా శెట్టి శివాజితో పెద్ద వాదనే పెట్టుకుంది. శివాజీ చెప్పింది కరెక్ట్ కాదు అని తెగేసి చెప్పింది శోభా.  భోలెతో గొడవ జరిగిన తర్వాత నేను తప్పు చేశానని మీరు చెప్పొచ్చు కానీ చెప్పలేదు. లేదంటే వీకెండ్‌లో అయినా ఈ విషయం గురించి చెప్పొచ్చు. అలా కాకుండా నామినేషన్స్‌లో మాత్రమే చెప్పి ఆడియన్స్ ముందు నన్ను బ్యాడ్ చేయాలనుకుంటున్నారా..? అని శివాజీని ప్రశ్నించింది శోభా. ఆతర్వాత శోభను ఉద్దేశిస్తూ.. నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలంటే, నువ్వు మాత్రమే పోగలవు. నిన్ను ఎవడూ పంపించేయలేడు అని అన్నాడు చివరకు శివాజీ అయినా సరే. ఇక ఈ వారం నామినేట్ అయినా వారు వీరే.. శివాజీ – శోభాశెట్టి, ప్రియాంక.. అశ్విని – శోభాశెట్టి, ప్రియాంక..గౌతమ్ – ప్రశాంత్, భోలె.. ప్రియాంక – భోలె, అశ్విని.. సందీప్ – అశ్విని, భోలె..శోభాశెట్టి – శివాజీ, యవర్..భోలె – శోభాశెట్టి, గౌతమ్. నామినేషన్స్ లో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.