ఓటీటీల పుణ్యమా ప్రేక్షకులకు డబుల్ వినోదం అందుతోంది. థియేటర్స్ లో చూసే సినిమాలను థియేటర్స్ లో చూస్తున్నారు. అలాగే ఓటీటీ సినిమాలకు ఇంట్లో కూర్చొని చూస్తున్నారు ప్రేక్షకులు. ఒకసారి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలను మరోసారి ఓటీటీలో చూసి ఆనందిస్తున్నారు. దాంతో ఓటీటీలోనూ సినిమాలకు రికార్డ్ వ్యూస్ వస్తున్నారు. ఎంత హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అయినా సరే నెల రోజులు లేదా ఇంకో పదిరోజులు కలుపుకొని 40 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే అవార్డులు సొంతం చేసుకున్న ఓ సినిమా మాత్రం ఇంతవరకు ఓటీటీలోకి అడుగుపెట్టలేదు. దాదాపు రెండేళ్లు అవుతున్న ఆ సినిమా మాత్రం ఓటీటీలోకి రాలేదు. ప్రేక్షకులంతా ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇంతకు ఆ సినిమా ఏంటంటే..
నయనతార హీరోయిన్ గా ఎంత బిజీ ఆర్టిస్ట్ అనేది అందరికి తెలిసిందే. హీరోయిన్ గానే కాకుండా ఆమె నిర్మాతగానూ మారి సినిమాలు తెరకెక్కించింది. అలా వచ్చిన సినిమానే పెబ్బల్స్. ఈ సినిమాకు నయన్ భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు పలు అవార్డులు కూడా వచ్చాయి. అలాగే ఈ సినిమా ఏకంగా ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. పెబ్బల్స్ సినిమాను సోని లీవ్ దక్కించుకుంది. అక్టోబరు 27న సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది పెబ్బల్స్. మరి ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక నయన్ ప్రస్తుతం బాలీవుడ్ లో మరోసినిమా చేస్తుందని టాక్. ఇప్పటికే షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటించింది నయన్. ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి హిందీ సినిమాలో నటించనుందని టాక్ వినిపిస్తోంది.
View this post on Instagram
నయనతార ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..
View this post on Instagram
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..