-
బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది స్టార్ కిడ్ జాన్వీ కపూర్. దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది జాన్వీ కపూర్.
-
ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ హీరోయిన్ గా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది.
-
కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది జాన్వీ కపూర్. ఇక ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది.
-
కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది జాన్వీ కపూర్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
-
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ తాజాగా తన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో చీరకట్టులో ట్రెడిషనల్ గా మెరిసింది ఈ బాలీవుడ్ అందం.