సోమవారం జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్స్ మొదలైన విషయం తెలిసిందే. నిన్నది ఎపిసోడ్ లోనూ అదే నామినేషన్స్ కంటిన్యూ అయ్యాయి. ఈ ప్రక్రియలో హౌస్ మేట్స్ ఒకరితో ఒకరు వాదనలకు దిగారు. ముఖ్యంగా శోభా శెట్టి శివాజీ పై ఓ రేంజ్ లో ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ లో అమర్ దీప్ శివాజీని నామినేట్ చేయడంతో పాటు అయన పై రెచ్చిపోయాడు. ‘నేను చనిపోయేటప్పుడు కూడా నా పిల్లల్ని నీతో మాట్లాడొద్దని చెబుతాను’ అని అనడం కరెక్ట్ కాదు అని.. అది తనకు నచ్చలేదు అని అమర్ దీప్ శివాజీని నామినేట్ చేశాడు. దానికి శివాజీ మొహం మాడిపోయింది. ఎదో కవర్ చేయాలనీ చూశాడు కానీ వర్కౌట్ కాలేదు. నేను జోక్ గా చెప్పను అని శివాజీ అన్నాడు. కానీ అది కరెక్ట్ కాదు అని అమర్ అనడంతో శివాజీ సైలెంట్ అయ్యాడు. ‘గుర్తులేదు, చూడలేదు, మర్చిపోయా.. దిస్ ఈజ్ మై ప్లాన్’ అని శివాజీ ఓ డైలాగ్ వేశాడు.
అలాగే ప్రిన్స్ యావర్ సందీప్ మాస్టర్ ను నామినేట్ చేశాడు. అయితే యావర్ రీజన్ చెప్తున్నా సమయంలో సందీప్ బొంగులోది అనే పదాలను వాడాడు. అంతే కాదు పదేపదే అదే పదాన్ని వాడటంతో దాన్ని బీప్ చేశారు. ఈ గొడవలు ఆమద్యలో శివాజీ రావడంతో శివాజీ పై సీరియస్ అయ్యాడు సందీప్. మరోవైపు గౌతమ్ వెర్సస్ రైతు బిడ్డ సీన్ జరిగింది.
ప్రశాంత్ , గౌతమ్ ను నామినేట్ చేశాడు. సరైన రీజన్ చెప్పకపోవడంతో గౌతమ్ ప్రశాంత్ పై రివర్స్ అయ్యాడు. నీ దగ్గర సరైన రీజన్ లేదు అని అనేశాడు. దాంతో ఎప్పటిలానే ప్రశాంత్ తన యాటిట్యూడ్ చూపిస్తూ కాసేపు హడావిడి చేశాడు. ఇక ప్రశాంత్ ఎలా ప్రవర్తిస్తున్నాడో చేసి చూపించాడు గౌతమ్ దాంతో ప్రశాంత్ షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయాడు. ఆతర్వాత అమర్ దీప్ ను నామినేట్ చేశాడు ప్రశాంత్. తన గ్రూప్ లో ఉన్న భోలే పై కామెంట్స్ చేయడం నచ్చలేదు అని అమర్ ను నామినేట్ చేశాడు ప్రశాంత్. దాంతో గ్రూప్ లో ఉన్నవాళ్లు అతన్ని కంట్రోల్ చేయలేకపోయారు అని భోలే అనడంతో .. వెంటనే శోభా సీన్ లోకి వచ్చింది. భోలే పై ఓ రేంజ్ లో మాటల యుద్ధం చేసింది శోభా. ఆతర్వాత అమరదీప్ చెవిలో గౌతమ్ ఏదో చెప్పాడని ప్రశాంత్ అన్నాడు. దానికి అమర్ నేను ఏమైనా చేస్తాను రా.. నువ్వేమైనా బిగ్ బాస్ వా.. దొబ్బెయ్ అంటూ రెచ్చిపోయాడు. ఏకినా, పీకినా, లాగినా ఏం చేసుకున్నా వెనకడుగు వేయను. ఒక్కటి గుర్తుపెట్టుకో ఇక్కడి నుంచి పోతే కప్పుతోనే పోతా.. ఎవ్వడు ఏమైనా చేసుకోండి అని అరిచి రచ్చ చేశాడు అమర్ దీప్.
ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీరే.. శోభా శెట్టి, భోలె, శివాజీ, అశ్విని, ప్రియాంక, అమరదీప్, సందీప్, గౌతమ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.