Most Recent

Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి మూవీ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అనిల్ రావిపూడి

Bhagavanth Kesari: బాలయ్య భగవంత్ కేసరి మూవీ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అనిల్ రావిపూడి

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడిగా  తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. బాలయ్య రెండుడిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మేపించాడు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను దూసుకుపోతోంది. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న భగవంత్ కేసరి సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఇదే ప్రశ్నకు దర్శకుడు అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న దగ్గర నుంచి భగవంత్ కేసరి సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ..

భగవంత్ కేసరి సినిమా కోసం తనతో కలిసి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు అనిల్. అలాగే ఈ సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌ తీసే ధైర్యం తనకు లేదని అన్నారు. భగవంత్ కేసరి మూవీ బరువు మోసినందుకే చాలా నలిగిపోయానని, ఇక ఇప్పుడు సీక్వెల్‌ తీయగలిగే శక్తిని బాలకృష్ణ గారు నాకిస్తే వెంటనే తీస్తానని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. దాంతో త్వరలోనే భగవంత్ కేసరి సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు నందమూరి అభిమానులు. అలాగే భగవంత్ కేసరి సినిమాకు సీక్వెల్ తీయాలని కోరుకుంటున్నారు కొందరు అభిమానులు.

 

View this post on Instagram

 

A post shared by Anil Ravipudi (@anilravipudi)

అనిల్ రావిపూడి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Anil Ravipudi (@anilravipudi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.