Most Recent

Bigg Boss 7 Telugu: ”అశ్విని పాప అప్పుడే మొదలు పెట్టేసిందిగా”.. హాట్ హాట్‌గా నామినేషన్స్

Bigg Boss 7 Telugu: ”అశ్విని పాప అప్పుడే మొదలు పెట్టేసిందిగా”.. హాట్ హాట్‌గా నామినేషన్స్

బిగ్ బాస్ సీజన్ 7 లోకి కొత్త ఊపు వచ్చింది. బిగ్ బాస్ 2.ఓపేరుతో కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వారిలో నయని పావని, అశ్విని, పూజమూర్తి, భోలే, అర్జున్ ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్ లో శుభ శ్రీని ఎలిమినేట్ చేసి గౌతమ్ ను సీక్రెట్ రూమ్ కు పంపించారు. మిగిలిన వారిని హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ చేశారు. దాంతో కొత్తవాళ్లతో కలిపి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 14 మంది ఉన్నారు. అయితే ఇక నేడు సోమవారం కావడంతో ఎలిమినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. కొత్తగా వచ్చిన వారు పాత హౌస్ మేట్స్ ను నామినేట్ చేయాల్సి ఉంటుందని. అందుకు సరైన రీజన్ చెప్పాలని చెప్పాడు బిగ్ బాస్. దాంతో కొత్తగా వచ్చిన ఐదుగురు మెంబర్స్. పాత హౌస్ మేట్స్ ను నామినేట్ చేశారు.

తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం ఎవరు వారిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారు నామినేట్ చేయాలనుకుంటున్న వారి బుగ్గ పై క్రాస్ మార్క్ ను వేయాలని చెప్పారు. దాంతో ముందుగా యూట్యూబర్ నయని పావని తేజను నామినేట్ చేసింది.  తేజ గేమ్ ఎక్కువగా ఆడలేదు అని అంది. దానికి తేజ పావనికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

మ్యూజిక్ కంపోజర్ భోలే సందీప్ మాస్టర్ ను నామినేట్ చేశాడు. స్మైలీ ఫోటో టాస్క్ లో గౌతమ్ మెడకు తేజ బెల్ట్ వేసి లాగే దాంట్లో సందీప్ తన వాయిస్ వినిపించలేదు అని భోలే అన్నాడు. దానికి సందీప్ కూడా క్లారిటీ ఇచ్చాడు. పూజ కూడా తేజను నామినేట్ చేసింది. దానికి కారణం ఆ గౌతమ్ కు బెల్ట్ వేసి లాగడమే అని తెలిపింది. ఇక అశ్విని అమర్ దీప్ ను నామినేట్ చేసింది. అతను చాలా సెల్ఫిష్ గా అనిపించిందని అంది. దాంతో అమర్ తన వాదన వినిపించాడు. ఇది బిగ్ బాస్ గేమ్ అని ఇక్కడ ఇలానే ఆడాలని అన్నాడు. ఆతర్వాత శోభా శెట్టి ని నామినేట్ చేసింది అశ్విని. దాంతో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గ్రూపిజం చేస్తున్నారు అని అశ్విని అనడంతో శోభా శెట్టి ఫైర్ అయ్యింది.

బిగ్ బాస్ సీజన్ 7 లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.