Most Recent

Bigg Boss 7 Telugu : దెబ్బకు దెబ్బకొట్టిన అమర్.. తట్టుకోలేక ఏడ్చిన శివాజీ..

Bigg Boss 7 Telugu : దెబ్బకు దెబ్బకొట్టిన అమర్.. తట్టుకోలేక ఏడ్చిన శివాజీ..

ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్‌తో.. గ్రాండ్గా మొదలైన సీజన్‌ 7 చాలా కొత్తగా.. దిమ్మతిరిగేలా సాగుతోంది. ఎవరూ ఊహించని ట్విస్టులు..ఎలిమినేషన్స్‌తో.. అందర్నీ విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇక ఇవ్వాళ్టి అంటే 48th ఎపిసోడ్‌ కూడా.. కెప్టెన్సీ టాస్క్‌తో వాడీ వేడీగా జరిగింది. కెప్టెన్సీకి ఎవరు అర్హులో.. కాదో చెబుతూ.. ఒక్కొక్కరిని ఆ కుర్చీ నుంచి దూరం చేయడం ఇంట్రెస్టింగ్గా సాగింది.

ఇక జిలేబి పురం, గులాబి పురం అంటూ రెండు గ్రూపులు క్రియేట్ చేసిన బిగ్ బాస్.. ఆ రెండు గ్రూపుల మధ్య టాస్క్‌లు పెట్టి.. గెలిచిన టీంలోని సభ్యులే కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారని చెబుతాడు. అందులో చివర్లో మిగిలిన ఇద్దరి నుంచే ఒకరు కెప్టెన్ అవుతాడంటూ.. అనౌన్స్ చేస్తాడు.

ఇక చెప్పినట్టే… గ్రూపుల మధ్య ఏలియన్ టాస్కులు పెట్టిన బిగ్ బాస్.. అందులో గెలిచిన జిలేబి పురం లోని సభ్యులను కెప్టెన్సీ కంటెడర్స్‌గా అనౌన్స్ చేస్తారు. ఇక వాళ్లలో ఎవరు కెప్టెన్ అవ్వాలనేది.. గులాబి పురం టీం చేతిలో పెడతాడు. అందుకోసం ఓ టాస్క్ డిజైన్ చేసినట్టు అనౌన్స్ చేస్తాడు.

బిగ్ బాస్ హౌస్‌ హాలులో.. ఓ చైన్ ఉంటుందని.. బజర్ మోగగానే.. గులాబి పురంలోని సభ్యులు ఎవరైతే ముందుగా ఆ చైన్ పట్టుకుంటారో.. వాళ్లు.. తమకు నచ్చని వ్యక్తిని సరైన కారణం చెప్పి కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తప్పించాలని టాస్క్‌లో భాగంగా ఆదేశిస్తాడు. అందుకోసం వారి ఫోటోను సిమ్మింగ్‌ పూల్లో పడేయాలని సూచిస్తాడు.

ఇక బజర్ మోగగానే మొదట చైన్ పట్టిన శోభ… కొత్తగా వచ్చిందనే కారణంతో.. అశ్విన ఫోటోను సిమ్మింగ్ పూల్లో పడేస్తుంది. అంటే.. కెప్టెన్సీ కంటెడర్‌గా ఆమెను తొలిగిస్తుంది. ప్రియాంకనే కెప్టెన్ అవ్వాలని బలంగా కోరుకుంటుంది కాబట్టి.. తేజతో కలిసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఆ తరువాత చైన్ పట్టుకున్న అమర్‌.. దెబ్బకు దెబ్బ అన్నట్టు శివాజీని నామినేట్ చేసి.. కెప్టెన్ కంటెండర్‌ నుంచి తొలగిస్తాడు. ఎందుకంటే… శివాజీ పెద్దమనిషిగా కెప్టెన్సీ టాస్క్‌లో ఉన్నాడే కానీ.. ఆడలేదని నిక్కచ్చిగా చెబుతాడు. అందుకు శివాజీ విపరీతంగా హర్ట్ అవుతాడు. ఆ తరువాతే అసలు మాటల యుద్ధాన్ని మొదలెడతాడు. ఇలా అయితే ఈ హౌస్‌లో ఉండలేనంటూ.. మైక్ తీసి మరీ తన అసహనాన్ని వెల్లగక్కుతాడు. అమర్ కూడా ఏ మాత్రం తగ్గకుండా.. తన పని తాను చేసేస్తాడు. శివాజీ ఫోటోను పూల్లో పడేస్తాడు. తర్వాత పక్కనే కూర్చుని గులుగుతున్న శివాజీకి మరో సారి తన రీజన్ ఏంటో క్లియర్గా చెబుతాడు.

అయితే అంతకు ముందు.. కెప్టెన్సీ కంటెడర్స్‌ టాస్క్‌లో.. పెద్ద మనిషిగా ఉన్న శివాజీకి.. కెప్టెన్సీ కంటెండర్‌ అవడానికి ఓ అవకాశం ఇస్తాడు. అందుకోసం విన్నర్ జిలేబిపురం టీంలోని ఓ సభ్యునితో స్వాప్ చేసుకోవాలని చెబుతాడు. అందుకు భోళ.. వాలెంటీర్‌గా ముందుకొచ్చి.. తన సభ్యత్వాన్ని శివాజీకి ఇస్తాడు. అలా శివాజీ కెప్టెన్ కంటెండర్ అయి.. అమర్ చేతిలో చిక్కి.. నామినేట్ అయిపోతాడు.

ఇక ఆ తరువాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌కు వెళ్లిన శివాజీ.. బిగ్ బాస్‌తో తన బాధను చెప్పకుంటూ బావురుమంటాడు. చేయి బాగా నొప్పిగా ఉందని.. పైకి మాత్రమే నలుగురిలో నవ్వుకుంటూ ఉంటున్నా అంటూ.. కన్నీళ్లు పెట్టుకుంటాడు. అందరూ గేమ్ ఆడలేకపోతున్నావంటే బాధగా ఉందని అంటాడు. తాను బయటికి వెళితే తన బదులు ఇంకొకరు హౌస్‌లో ఉండేవాళ్లుగా అని వాళ్లు చెబుతున్న మాట.. తనకు కూడా నిజమే అనిపిస్తుందని బిగ్ బాస్‌తో బాధగా చెబుతాడు శివాజీ. దీనికి బిగ్ బాస్.. మరో సారి ఆసుపత్రికి తీసుకెళతామని మెరుగైన వైధ్యం చేపిస్తామన చెప్పి హౌస్‌లోకి పంపిస్తాడు.

ఇక ఆ తరువాత బజర్ మోగగానే హాలులో ఉన్న చైను పట్టుకున్న పూజా మూర్తి.. నేరుగా రైతు బిడ్డను నామినేట్ చేస్తుంది. రీజన్‌గా ఒక సారి కెప్టెన్ అయ్యాడు కనుకు.. ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. అందుకు షరా మామూలుగానే పల్లవి ప్రశాంత్ ఫీలవుతాడు.

ఇక ఆ తరువాత బజర్ మోగినా ఎవరూ చైన్ పట్టుకోకపోవడంతో.. బిగ్ బాస్ .. కంటెస్టెంట్స్ అందరిపై సీరియస్ అవుతాడు. సేఫ్ గేమ్ ఇక్కడ కుదరదని చెబుతాడు. కెప్టెన్సీ టాస్క్‌ను ముందుకు సాగనివ్వాలని ఆదేశిస్తాడు. శోభ కూడా ఇదే చెబుతూ ప్రిన్స్ యావర్తో వాదనకు దిగుతుంది. ఇక వీళ్ల వాదన ముగినిస తర్వాత చైన్‌ తీసుకున్న ప్రిన్స్ యావర్‌.. ప్రియాంకను నామినేట్ చేస్తాడు. ఆమె ఫోటోను స్విమ్మింగ్ పూల్లో పడేస్తాడు. రీజన్ ప్రియాంకకు పేషన్స్ లేదని.. అది కెప్టెన్‌కు ఉండాల్సిన ప్రైమరీ థింగ్ అని చెబుతాడు. అక్కడి వరకు బానే ఉన్నా.. మధ్యలో అమర్ పేరు తీసుకువస్తాడు. దీంతో ప్రియాంక ఆగ్రహానికి గురవుతాడు ప్రిన్స్.

ఇక చివర్లో స్విమ్మింగ్ పూల్లో పడేసిన ఫోటోలు కాక.. జిలేబి పురంలో మిగిలిన అర్జున్, సందీప్‌ల మధ్య.. ఫైనల్ కెప్టెన్సీ టాస్క్‌ ఉంటుందని అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.