Most Recent

Tiger Nageshwara rao Twitter review: ‘టైగర్ నాగేశ్వర రావు’ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ మూవీపై అడియన్స్ రియాక్షన్..

Tiger Nageshwara rao Twitter review: ‘టైగర్ నాగేశ్వర రావు’ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ మూవీపై అడియన్స్ రియాక్షన్..

మాస్ మహారాజా రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావు. డైరెక్టర్ వంశీ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇందులో గుర్రం జాషూవా కుమార్తె హేమలత లవణం పాత్రలో సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ నటించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈరోజు (అక్టోబర్ 20)న గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పటికే చాలాచోట్ల ప్రీమియర్స్ షోస్ చూసిన అడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావు అదిరిపోయిందంటూ రివ్యూస్ ఇస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్ అని.. ముఖ్యంగా రవితేజ మాస్ ఎంట్రీ మాత్రం అదిరిపోయిందని.. ఇక స్క్రీన్ ప్రజెన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో టైగర్ నాగేశ్వర రావు సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

అలాగే ఈ సినిమాలోని ప్రతి ఫైట్ సీన్ మాత్రం సూపర్ అని.. ఇక జీవి ప్రకాష్ అందించిన బీజీఎం వేరేలెవల్. ఈ సినిమా రవితేజ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. టైగర్ నాగేశ్వర రావు సినిమా గురించి అంటే.. హీరో ఇంట్రడక్షన్.. యాక్షన్ సీన్స్ గురించి ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ట్రైన్ సీక్వెన్ బాగుందని.. మాస్ మాహారాజా అభిమానులకు గూస్ బంప్స్ అంటున్నారు. ఇక రవితేజ.. రేణు దేశాయ్ పాత్రలను డిజైన్ చేసిన తీరు బాగుందని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.