Most Recent

Nani: “అన్నొస్తున్నాడు అని చెప్పండి”.. సలార్ సినిమా పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Nani: “అన్నొస్తున్నాడు అని చెప్పండి”.. సలార్ సినిమా పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నేచరుల్ స్టార్ నాని రీసెంట్ గా దసరా సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. నాని మొదటి సారి ఈ సినిమాలో మాస్ మసాలా పాత్రలో నటించి మెప్పించాడు. దసరా సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఫుల్ జోష్ లో ఉన్న నాని ఇప్పుడు మరోసారి బ్యూటీఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హాయ్ నాన్న అనే డిఫరెంట్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. అందమైన ప్రేమ కథతో పాటు ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య ఉండే బాండింగ్ కూడా చూపించనున్నారు . ఇక హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ టీజర్ సినిమా పై ఇంట్రెస్ట్ ను డబుల్ చేసింది. ఈ టీజర్ లో తండ్రి కూతురు బాండింగ్ గురించి చూపిస్తూనే .. మృణాల్ తో లవ్ ట్రాక్ కూడా చూపించారు. పెళ్ళై పాప ఉన్న హీరోని ఒక అమ్మాయి ప్రేమించడం.. ఆమెను హీరో మిస్ అండర్స్టాండ్ చేసుకోవడం. ఆతర్వాత హీరో రియలైజ్ అవ్వడం ఈ టీజర్ లో చూపించారు.

ఇక ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ ప్రెస్ మీట్ లో నాని సలార్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ముందుగా హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 21 కానీ 22న  రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ ఒక కుటుంబంలో పెద్దన్న సినిమా వస్తున్నప్పుడు తమ్ముడు డేట్ మార్చుకోవాలి కదా.! అని అన్నారు. సలార్ డిసెంబర్ 22 రిలీజ్ కానుంది. దాంతో నాని తన సినిమాను డిసెంబర్ 7కు మార్చుకున్నారు.  డిసెంబర్ మొత్తం లవ్ స్టోరీ, యాక్షన్ ఎంటర్టైనర్స్ తో నిండిపోవాలని అని నాని అన్నాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. థాంక్యూ నాని అన్న అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

డిసెంబర్ 7 నాని హాయ్ నాన్న రిలీజ్ కానుంది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.