
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రుతిహాసన్. అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రుతిహాసన్. తొలి సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టిసింది శ్రుతి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. ఆతర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది. ఆతర్వాత హిందీలోనూ అడుగుపెట్టింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. తెలుగులోనూ ఒకానొక టైం లో వరుస ఫ్లాప్స్ అందుకుంది. ఆతర్వాత రవితేజ నటించిన క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకొని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే శ్రుతిహాసన్ కు ఓ వింత వ్యాధితో బాధపడుతుందని తెలుస్తోంది.
మల్టీటాలెంటెడ్ బ్యూటీ
శ్రుతిహాసన్ కేవలం నటి మాత్రమే కాదు. ఆమె సింగర్ కూడా.. ఆమె పలు పాటలు కూడా పడింది. అలాగే పలు ప్రైవేట్ సాంగ్ కూడా పడింది. ఆమె పలు పాప్ ఆల్బమ్స్ కూడా చేసింది. ఆమె మ్యూజిక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.
సోషల్ మీడియాలో..
శ్రుతిహాసన్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫొటోలతో పాటు.. తన మ్యూజిక్ వీడియోలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అలాగే తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను కూడా షేర్ చేసి ఆకట్టుకుంటుంది. అలాగే అభిమానులతో చిట్ చాట్ చేసి తన వ్యక్తిగత విషయాలను కూడా తెలుపుతూ ఉంటుంది శ్రుతిహాసన్.
వింత వ్యాధి..
ఇదిలా ఉంటే శ్రుతిహాసన్ ఓ వ్యాధితో బాధపడుతుంది తెలుస్తోంది. తాను ఒత్తిడి ఎక్కువైతే ఊహించని విధంగా మారిపోతుందట. తాను ఎక్కువ స్ట్రస్ ఫీలై అయితే ఆమెకు ఎక్కువ కోపం వస్తుందట. ఒత్తిడి ఎక్కువైతే విపరీతమైన ఆవేశానికి లోనవుతుందట. ఆ సమయంలో చిన్న విషయానికి కూడా విపరీతంగా కోపం తెచుకుంటుందట. అరిచి గోల గోల చేస్తుందట శృతి. కోపం తగ్గాకా.. ఎందుకు ఇలా చేశానా అని బాధపడుతుందట. అయితే దీని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుందట..స్ట్రెస్ ఎక్కువైనప్పుడు సైలెంట్ గా మ్యూజిక్ వింటుందట శ్రుతిహాసన్. ఇది అంత పెద్ద సమస్య కాదు అని అంటున్నారు నెటిజన్స్. కొంతమంది మాత్రం ఇది ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ట్రీట్‌మెంట్ తీసుకోవాలి అంటున్నారు మరికొందరు. ఇప్పుడు ఈన్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..