
నేచురల్ స్టార్ నాని అంటే మినిమమ్ గ్యారెంటీ అని ప్రేక్షకులకు గట్టిగా నమ్ముతారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తాడు నాని. అందుకే ఆయన సినిమాలు ఎలాంటి టాక్ తెచ్చుకున్న ప్రేక్షకులు మాత్రం ఆదరిస్తూ ఉంటారు. ఈ కుర్ర హీరో కూడా హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఈ కుర్ర హీరో రీసెంట్ గా దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాని మాస్ మసాలా పాత్రలో నటించి మెప్పించారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే మొదటి సారి తెలంగాణ యాసలో మాట్లాడి మెప్పించారు నాని. ఇక ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మన నేచురల్ స్టార్.
నాని కెరీర్ బిగినింగ్
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించాడు నాని. బాపు లాంటి దిగ్గజ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశాడు నాని. ఆతర్వాత అష్టాచమ్మా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత అలా మొదలైంది సినిమాతో సూపర్ సక్సెస్ నుం అందుకున్నాడు. ఆతర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు నాని .
నేచురల్ స్టార్ నాని అంటే మినిమమ్ గ్యారెంటీ
నానిను ఉన్న బిరుదే నేచురల్ స్టార్. తనదైన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు నాని. నాని యాక్టింగ్ చూస్తే సినిమాలో హీరోల ఉండదు మన పక్కింటి కుర్రాడిగా అనిపిస్తుంది. అలాగే నాని కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఎమోషన్స్ విషయంలో నాని గుండెలు పిండేస్తాడు.
నాని నయా మూవీ
దసరా సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు హాయ్ నాన్న అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తండ్రి కూతురు మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది.
బంపర్ ఆఫర్
నాని ఇప్పుడు ఓ క్రేజీ ఆఫర్ అందుకున్నారని తెలుస్తోంది. నాని సూపర్ స్టార్ రజినీకాంత్ కు వీరాభిమాని అని తెలిసిందే. ఆయన సినిమాల్లో సూపర్ స్టార్ ను ఇమిటేట్ కూడా చేస్తుంటారు. ఇక ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో నాని కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. జైలర్ సినిమాతర్వాత రజిని టి.జె.జ్ఞానవేల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని కీలక పాత్రలో నటించే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది. దీని పై త్వరలోనే క్లారిటీ రానుంది.
Happy birthday yashna. Have a wonderful one
From
Me and Mahi@MissThakurani #HiNanna pic.twitter.com/hGtOAGhdD8
— Nani (@NameisNani) August 1, 2023