Most Recent

Anikha Surendran: బంపర్ ఆఫర్ అందుకున్న అనిఖా సురేంద్రన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

Anikha Surendran: బంపర్ ఆఫర్ అందుకున్న అనిఖా సురేంద్రన్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

అనిఖా సురేంద్రన్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. ముఖ్యంగా అజిత్ నటించిన విశ్వసం, ఎంతవాడు కానీ సినిమాల్లో నటించింది ఈ చిన్నది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆ తర్వాత తమిళ్‌లో కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో బుట్టబొమ్మ అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్‌గా నటించింది అనిఖా సురేంద్రన్. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. హీరోయిన్ గా అనిఖా సురేంద్రన్ తన నటనతో ఆకట్టుకుంది. దాంతో ఈ అమ్మడికి వరుస సినిమా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తెలుగులోనూ ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. అనిఖా సురేంద్రన్‌ అందుకున్న బంపర్ ఆఫర్ ఏ హీరో సినిమాలోనో తెలుసా..

అనిఖా సురేంద్రన్‌కు ధనుష్ సినిమా నుంచి ఛాన్స్ వచ్చిందట. ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ధనుష్ కెరీర్ లో 50 సినిమాను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా కు ధనుష్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనిఖా సురేంద్రన్‌కు లీడ్ రోల్ ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. అంతే కాదు ఆమె పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం గా ఉంటుందని అంటున్నారు.

ధనుష్ రీసెంట్ గా సార్ సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు ధనుష్. ఈ సినిమాకూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నారని టాక్.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.