Most Recent

Urvashi Rautela: మర కరజ ఆఫర కటటసన ఊరవశ.. ఆ సటర హర సనమల సపషల సగ

Urvashi Rautela: మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన ఊర్వశి.. ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్

ఊర్వశి రౌతేల.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. బాలీవుడ్ లో బిజీ యాక్టర్ గా గడుపుతున్న ఈ బ్యూటీ సౌత్ లో స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. బాస్ పార్టీ అనే పాటలో అదరగొట్టింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసింది. సినిమా హిట్ కాకపోవడంతో అంతగా ఈ పాట పాపులర్ కాలేదు. ఇక ఇప్పుడు ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమాలో మెరిసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్రో మూవీ మైడియర్ మార్కిండేయ సాంగ్ లో కనిపించింది. ఈ చిన్నది తన అందంతో మరోసారి ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

ఆ తర్వాత ఇప్పుడు మరో స్పెషల్ సాంగ్ చేయనుందట ఈ భామ. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి నటిస్తున్న పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన పుష్ప మూవీనుంచి విడుదలైన సమంత స్పెషల్ సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

సమంత సాంగ్ సంచలన హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 లో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 లో మరోసారి సాంగ్స్ అదిరిపోనున్నాయని తెలుస్తోంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.