Most Recent

Tollywood: టలవడల మర కరజ కబనషన.. రవతజ వషవక సన మనజ కలస సనమ..

Tollywood: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్.. రవితేజ, విష్వక్ సేన్, మనోజ్ కలిసి సినిమా..

టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించింది. మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అన్ని దేశాల అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా ఇతరభాషల్లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ను అందుకుంటున్నాయి. ఇక రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందోప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా ఈ సినిమా స్కార్ అవార్డు కూడా అందుకుంది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ ను దృష్టిలో పెట్టుకొని రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ భారీ మల్టీస్టారర్ మూవీ రాబోతుందట.

ఇప్పటి వరకు టాలీవుడ్ లో చాలా మల్టీ స్టారర్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ రానుందట. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోలు నటించనున్నారట. రవితేజ, విశ్వక్ సేన్, మనోజ్ కాంబోలో మల్టీస్టారర్ సినిమా రానుందట.

కలర్ ఫోటో సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని టాక్. ఇక ఈ సినిమాలో మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు విశ్వక్ సేన్ కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీగా ఉన్నాడు. త్వరలోనే దీని పై క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.