
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ప్రాజెక్ట్ కె. భారీ తారాగణంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలలో నటిస్తుండగా.. ఇటీవలే లోక నాయకుడు కమల్ హాసన్ ఈ మూవీలో భాగమయ్యారు. దీంతో ఈ మూవీపై మరింత హైప్ ఏర్పడింంది. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినీ ప్రియులలో క్యూరియాసిటిని పెంచాయి. ఇక గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే భారీ హైప్ మధ్య రూపొందుతోన్న ఈ సినిమా విడుదలకు ముందే అరుదైన ఘనత సాధించింది.
సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్లో ఈ సినిమా పాల్గొనుంది. ఈ వేడుకలో అడుగుపెట్టనున్న తొలి ఇండియన్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ నెలలో జరిగే ఈవెంట్లో ఈ మూవీ అఫీషియల్ టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఈ మూవీ టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రాజెక్ట్ కె టీషర్ట్ అందుబాటులోకి తీసుకువచ్చారు మేకర్స్. టీషర్ట్ పై ప్రాజెక్ట్ అని రాసి ఉన్న టీషర్టును సొంతం చేసుకోవాలంటే అభిమానులు దరఖాస్తు చేసుకోవాలని ఉంటుంది.
ప్రాజెక్ట్ కె టీషర్ట్ కావాలంటే.. చిత్రయూనిట్ షేర్ చేసిన లింక్ పై క్లిక్ చేస్తే ఓ కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ పసుపు రంగులో ఉంటే కంటిన్యూ బటన్ పై క్లిక్ చేసి.. మన పేరుతోపాటు మెయిల్ ఐడీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన సైజ్ లో టీషర్టుని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇక ఫస్ట్ బ్యాచ్ కు సంబంధించిన టీషర్ట్స్ నాలుగు నిమిషాల్లో అయిపోయినట్లు వెల్లడించింది చిత్రయూనిట్. ఇక త్వరలోనే మరికొన్నింటిని తీసుకువస్తామని తెలిపింది.
First Drop ‘The Force’ is SOLD OUT in just 4 minutes
Get ready for the next drop.
Stay Tuned
https://t.co/0rC0ez8o2N#ProjectK #WhatisProjectK pic.twitter.com/IijnCOonUB
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
