Most Recent

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ దర్శకుడు కన్నుమూత

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ దర్శకుడు కన్నుమూత

హైదరాబాద్‌, జులై 30: గత కొంతకాలంగా టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాగాజా ప్రముఖ దర్శకుడు ఎన్‌ఎస్‌ఆర్‌ ప్రసాద్ (49) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతోన్న ఆయన హైదరాబాద్‌లోని స్వగృహంలో శనివారం (జులై 29) తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

ఎన్‌ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ స్వస్థలం ఆంధ్రాలోని పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం. సినిమాలపై మక్కువతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలినాళ్లలో రచయితగా పనిచేసినప్పటికీ అనతికాలంలోనే ఆయన ప్రతిభను గుర్తించి ప్రముఖ నిర్మాత దివంగత రామానాయుడు తన నిర్మాణ సంస్థలో తొలి అవకాశం ఇచ్చారు. అలా ‘నిరీక్షణ’ మువీతో డైరెక్టర్‌గా మారాడు. ఆ సినిమాలో ఆర్యన్‌ రాజేశ్‌ హీరోగా నటించాడు. ఆ తర్వాత నటుడు శ్రీకాంత్‌తో ‘శత్రువు’, నవదీప్‌తో ‘నటుడు’ సినిమాలను రూపొందించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెక్కీ’ మువీ ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.