ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తానేంటో సినీ ఇండస్ట్రీలో నిరూపించుకున్న హీరో రవితేజ. ఆ తర్వాత మాస్ మహారాజాగా సత్తా చాటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు రవితేజ. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు రవితేజ. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గత ఏడాది ధమాకా సినిమాతోసూపర్ అందుకున్న రవితేజ. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఆయన నటించిన రావణాసుర సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. అలాగే త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా రవితేజ రెమ్యునరేషన్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. రవితేజ ఒకొక్క సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్ వుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రవితేజకు ఏకంగా 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వనుందట.
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ రవితేజకు 100 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. అయితే ఇది ఒక సినిమా కోసం కాదు. పీపుల్స్ మీడియా సంస్థ రవితేజతో నాలుగు సినిమాలు చేస్తున్నారట. ఇందుకోసం 100కోట్ల రెమ్యునరేషన్ కు ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.