Most Recent

Adipurush: మంచి మనసు చాటుకున్న స్టార్‌ సింగర్‌.. పేద పిల్లల కోసం 10 వేల ఆదిపురుష్‌ టికెట్ల బుకింగ్

Adipurush: మంచి మనసు చాటుకున్న స్టార్‌ సింగర్‌.. పేద పిల్లల కోసం 10 వేల ఆదిపురుష్‌ టికెట్ల బుకింగ్

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఆదిపురుష్‌. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రామాయణం మహాకావ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కృతిసనన్‌ జానకి పాత్రలో నటించగా, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా కనిపించనున్నారు. భూషణ్‌ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్‌ సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేష్‌ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌ సుమారు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆదిపురుష్‌ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ప్రభాస్‌ సినిమా జూన్‌ 16న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌ కూడా పూర్తయ్యాయి. రఘురాముడి కథ అందరికీ చేరాలనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీలోని పలువురు స్టార్‌ హీరోలు అడ్వాన్స్‌గానే ఆది పురుష్‌ టికెట్లు బుక్‌ చేస్తున్నారు. పేద పిల్లలు, అనాథలు, వృద్ధులకు ఈ టిక్కెట్లను ఉచితంగా అందించనున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ వృద్ధులకు, అనాథలకు ‘ఆదిపురుష్‘ మూవీని ఫ్రీగా చూపిస్తానని మాటిచ్చారు. ఇందుకోసం 10 వేల టికెట్స్ కూడా బుక్ చేశారు.

ఇక బాలీవుడ్ రాక్‌ స్టార్‌ రణ్​బీర్ కపూర్ కూడా పేద పిల్లల కోసం 10 వేల టికెట్స్ బుక్ చేశారు. తాజాగా ఈ జాబితాలో మరో సెలబ్రిటీ చేరారు. ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కూతురు, బాలీవుడ్ స్టార్ సింగర్ అనన్య బిర్లా కూడా ‘ఆదిపురుష్’ మూవీ 10 వేల టికెట్లు బుక్‌ చేశారు. అనాథలు, పేద పిల్లల కోసం ఈ టిక్కెట్లను కొనుగోలు చేసినట్లు అనన్య తెలిపారు. దీంతో ఈ స్టార్‌ సింగర్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ananya Birla (@ananyabirla)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.