Most Recent

Vanitha Vijaykumar: ‘పీటర్‌ నా మూడో భర్త కాదు.. మా పెళ్లి న్యాయబద్ధంగా జరగలేదు’

Vanitha Vijaykumar: ‘పీటర్‌ నా మూడో భర్త కాదు.. మా పెళ్లి న్యాయబద్ధంగా జరగలేదు’
Vanitha Vijaykumar

ప్రముఖ నిర్మాత పీటర్‌ పాల్‌ (39) అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ‘వనిత మూడో భర్త మృతి’ అంటూ పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంతో నటి వనిత విజయ్‌కుమార్‌ స్పందిస్తూ.. పీటల్‌ పాల్‌ తన భర్త కాదని, తామిద్దరం న్యాయబద్ధంగా వివాహం చేసుకోలేదని ఖడించారు.

‘పీటర్ పాల్ మృతి ఘటనపై స్పందించాలా? వద్దా? అనే విషయంపై చాలా ఓపిక పట్టాను. నాకు అవకాశం లేకుండా చేశారు. అన్ని మీడియా సంస్థలు, న్యూస్‌ ఛానళ్ల మీద ఉన్న గౌరవంతో ఈ విషయం చెబుతున్నా. పీటర్‌పాల్‌తో నాకు న్యాయబద్ధంగా వివాహం జరగలేదు. 2020లో కొన్ని రోజుల పాటు మేము రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. అది అదే సంవత్సరం ముగిసింది. నేను ఆయన భార్యను కాదు. అతను నా భర్త కాదు. వనిత మూడో భర్త చనిపోయాడంటూ వార్తలు రాయడం ఆపండి. నాకు భర్తలేడు. ఏ విషయానికి నేను బాధపడటం లేదు. ప్రస్తుతం నా జీవితాన్ని సంతోషంగా కొనసాగిస్తున్నాను. మీ అందరికీ ఇదే నా విన్నపం.. మిస్‌ వనిత విజయ్‌కుమార్‌’ అని తాజాగా ట్వీట్‌ చేశారు.

కాగా నిర్మాత పీటర్‌ పాల్‌-వనిత విజయకుమార్‌లు 2020లో జూన్‌ 27న క్రైస్తవ వివాహం చేసుకున్నారు. అతిథులందరి ముందు వెస్ట్రన్‌ స్టైల్‌లో పీటర్‌ పాల్‌-వనిత ఒకరినొకరు కిస్‌ చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్‌ మీడియాలో తెగ వెరల్‌ అయ్యాయి. వీరి పెళ్లి చట్టబద్ధం కాదని పీటర్‌ మొదటి భార్య ఎలిసబెత్ కోర్టు కెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఏడాది తిరిగేసరికి పీటర్ నుంచి విడిపోయారు. ఆ తర్వాత తండ్రితో ఆస్తి గొడవలు, పెళ్లిళ్ల విషయంలో వివాదాలతో పలుమార్లు ఆమె వార్తల్లో నిలిచారు.

తమిళంలో బిగ్ బాస్ షోతో పాపులర్‌ అయిన నటి వనిత పలు సీరియళ్లు, సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తెలుగులో సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మళ్ళీ పెళ్ళి’ మువీలో ఆయన నిజ జీవిత రెండో భార్య పాత్రలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.