Most Recent

Vanitha Vijay Kumar: మా నాన్న తమిళనాడులో అడుగుపెట్టనివ్వనన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన వనిత విజయ్ కుమార్

Vanitha Vijay Kumar: మా నాన్న తమిళనాడులో అడుగుపెట్టనివ్వనన్నాడు.. షాకింగ్ విషయం చెప్పిన వనిత విజయ్ కుమార్
Vanitha Vijay Kumar

ఇటీవల వివాదాలతో వార్తల్లో నిలిచిన వనితా విజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని ఆమె హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న తమిళ్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత. నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఆమె ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. అలాగే పలు కాంట్రవర్సీలతోనూ వనిత విజయ్ కుమార్ వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వనిత హాట్ కామెంట్స్ తో పాపులారిటీ తెచ్చుకున్నారు. రీసెంట్ గా ఆమె నరేష్, పవిత్రలోకేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నటించారు. ఈ సినిమాలో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి పాత్రలో అనే నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు వనిత.

ఇటీవలే వనిత పెళ్లి చేసుకొని విడిపోయిన నాలుగో భర్త మరణించిన విషయం తెలిసిందే.. అయన మృతి పై వనిత ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వనిత మాట్లాడుతూ.. తనకు ఎదురైనా చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తన ఫ్యామిలీ తనకు చేసిన అన్యాయం గురించి తెలిపింది వనిత విజయకుమార్

తన కుటుంబ సభ్యులే తనను వేరు చేశారని.. ఇంటనుంచి బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్థి తగాదాల వల్లే తనను దూరం పెట్టారని తెలిపింది. ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. ఆ సమయంలో ఎక్కడకి వెళ్లాలో తెలియక కర్ణాటకలో రెండేళ్లు పిల్లలతో ఉన్నా.. ఆసమయంలో మా నాన్నకు ఫోన్ చేస్తే.. తమిళనాడులో అడుగు కూడా పెట్టనివ్వనని బెదిరించాడు అని తెలిపారు. కానీ తమిళనాడు ప్రజలు తనని తమ బిడ్డగా చూస్తారని చెప్పుకొచ్చారు వనిత.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.