

సినిమా అంటే అతనికి పిచ్చి. నటన అంటే పిచ్చి. తన మూవీస్ కోసం ఎంతటి సాహసాలకైనా వెనకడుగు వెయ్యాడు. స్టార్ నటుడి తనయుడు. అయినా తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్నాడు. తొలిసినిమాతోనే హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ బాలీవుడ్ హీరోకు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎవరో గుర్తుపట్టండి. సినిమా అప్డేట్స్ కాదు.. ఇతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రేమ విషయాలే ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. ఎవరో గుర్తుపట్టండి. అతను 2018లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ 33 ఏళ్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరో గుర్తుపట్టాగలరా ?.. తనే బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్. అతని అసలు పేరు జై హేమంత్ ష్రాఫ్. కానీ సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తన పేరును టైగర్ ష్రాఫ్ అని మార్చుకున్నారు.
2014లో యాక్షన్ రొమాన్స్ హీరోపంతితో సినీరంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత వార్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. మున్నా మైఖేల్, బాఘీ 2, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, బాఘీ 3 చిత్రాల్లో నటించి మెప్పించాడు. టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ మధ్య ప్రేమాయణం నడిచిందని గతంలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీరిద్దరు కలిసి అనేకసార్లు బయట కనిపించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. తమ గురించి వస్తున్న వార్తలపై అటు టైగర్ ష్రాఫ్.. ఇటు దిశా స్పందించలేదు.
చాలా కాలం ప్రేమలో ఉన్న ఈ జంట.. గతేడాది విడిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టారు. ఆయన ఇప్పుడు బడే మియాన్ చోటే మియాన్ చిత్రంలో నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.