

మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. అతి తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది తాప్సీ. ఒకానొక సమయంలో తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. గత కొన్ని రోజుల క్రితం తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫోటోగ్రాఫర్లతో చిన్న చిన్న వాగ్వాదాలు జరగడంతో తాప్సీ పేరు నెట్టింట మారుమోగింది. బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న ఈ చిన్నది సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రభాస్ , రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా కూడా ఈ అమ్మడుకి అంతగా గుర్తింపు రాలేదు. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
అక్కడి ఫెయిర్ బ్రాండ్ కంగనా రనౌత్ తో మాటల యుద్ధం చేసింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటోలు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ సినిమా షూటింగ్స్ గ్యాప్స్ లో విదేశాల్లో విహరిస్తూ ఆ ఫోటోలను, వీడియోలను నెట్టింట అభిమానులను ఆకర్షిస్తుంది.
తాజాగా బికినిలో బీభత్సం సృష్టించింది ఈ బ్యూటీ. బ్లాక్ కలర్ బికినిలో అందాలు ఆరబోసింది తాప్సీ. కొంత కాలంగా హాట్ షోతో హీటు పెంచేస్తోన్న తాప్సీ .. తాజాగా ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటోలు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు కుర్రకారు కొంత కామెంట్స్ చేస్తున్నారు.