Most Recent

Sudheer Babu: ఏంటి..! సుదీర్ బాబు సమంతకు అన్నగా నటించారా..? ఆ సినిమా ఏంటో తెలుసా

Sudheer Babu: ఏంటి..! సుదీర్ బాబు సమంతకు అన్నగా నటించారా..? ఆ సినిమా ఏంటో తెలుసా
Sudheer Babu

మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది  నటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో సుధీర్ బాబు ఒకరు. ఎస్ ఎమ్ ఎస్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుధీర్ బాబు. తొలి సినిమాతోనే తన నటనతో మంచి  మార్కులు కొట్టేశారు. ఇక థన్ డాన్స్ లతో బాడీ ఫిటెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సుధీర్ బాబు. హిట్లు ఫ్లప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సమ్మోహనం సినిమా తర్వాత సుధీర్ బాబు ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు. అయినా వెనకడుగు వేయకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక బాలీవుడ్ లోనూ తన సత్తా చాటాడు. బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు.

ఇదిలా సుధీర్ బాబు స్టార్ హీరోయిన్ సమంతకు అన్న నటించాడన్న విషయం తెలుసా..? అవును సమంత నటించిన ఓ సినిమాలో సుధీర్ బాబు సామ్ బ్రదర్ గా కనిపియించాడు. ఆ సినిమా ఏంటంటే .. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేశావే. సామ్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే.

నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులను ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో సమంత అన్నగా నటించాడు సుధీర్ బాబు. చిన్న పాత్రే అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.