Most Recent

Shah Rukh Khan: సెల్ఫీ కోసం ప్రయత్నిస్తున్న ఫ్యాన్స్‌పై షారుఖ్ ఆగ్రహం.. ఇలాంటి వారితో వద్దు.. ఎవరితో తీసుకోవాలో సూచించిన నెటిజన్లు

Shah Rukh Khan: సెల్ఫీ కోసం ప్రయత్నిస్తున్న ఫ్యాన్స్‌పై షారుఖ్ ఆగ్రహం.. ఇలాంటి వారితో వద్దు.. ఎవరితో తీసుకోవాలో సూచించిన నెటిజన్లు
Shah Rukh Khan

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మళ్ళీ వివాదం లో చిక్కుకున్నాడు. ఎయిర్‌పోర్ట్‌లో షారుఖ్ ఖాన్ కు ఘన స్వాగతం పలికారు అభిమానులు. అయితే స్వాగతం పలకడానికి వచ్చిన అభిమానులు తమ అభిమాన హీరోతో ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. దీంతో షారుఖ్ ఖాన్ సహనం కోల్పోయాడు. ఒక అభిమాని షారుఖ్ తో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అభిమానిని వెనక్కి నెట్టాడు. అతని చేతిని దూరంగా నెట్టాడు. తిరిగి అతనివైపు చూడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. షారుఖ్ తీరుపై పలువురు మండి పడుతున్నారు. అదే సమయంలో అభిమానులు తీరు సరిగ్గా లేదంటూ షారుఖ్ ను సపోర్ట్ చేస్తున్నారు.

ఈ ఘటన అనంతరం షారుఖ్ ను అతని భద్రతా సిబ్బంది కారు దగ్గరకు తీసుకుని వెళ్లారు. ఈ సమయంలో షారుఖ్ నల్లటి టీ-షర్ట్, మ్యాచింగ్ లెదర్ జాకెట్, ప్యాంటు ధరించాడు. అతను స్నీకర్స్ మరియు ముదురు సన్ గ్లాసెస్‌ని ఎంచుకున్నాడు.

వైరల్ అవుతున్న వీడియో 

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ..  సెల్ఫీలు తీసుకోవాల్సింది ఇలాంటి వారితో కాదు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా కావలా కాస్తున్న ఆర్మీ జవాన్ల తో, భారతీయులకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్న ప్రముఖులతో అని కామెంట్ చేశారు. మరొకరు   పోరాడుతున్న ఆర్మీ, మనదేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న వారితో దిగండి అంటూ సలహాలిచ్చారు. మరొక నెటిజన్ రాస్తూ.. షారుఖ్ ఖాన్ ను సపోర్ట్ చేశారు.. అదే ప్లేస్ లో మీరుంటే ఒక్కసారి ఆలోచించండి అని కామెంట్ చేశారు.

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో జవాన్‌లో నటిస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో పోషిస్తున్నారు. జవాన్ జూన్ 2, 2023న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న డుంకీలో  తాప్సీ పన్నుతో  కనిపించనున్నారు. ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది.

అతను దర్శకుడు అట్లీ యొక్క రాబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జవాన్‌లో కూడా నయనతార మరియు విజయ్ సేతుపతితో కలిసి కనిపిస్తాడు.  థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. వార్తా సంస్థ ANI ప్రకారం, షారుఖ్ సల్మాన్ ఖాన్ టైగర్ 3లో ప్రత్యేక సన్నివేశాన్ని కలిగి ఉంటాడు. సల్మాన్ మరియు షారూఖ్ ఇటీవల పఠాన్‌లో కనిపించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.