Most Recent

Salman Khan’s Sister: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో చోరీ.. చెవి రింగులతో దొరికిపోయిన ‘ఇంటి దొంగ’..

Salman Khan’s Sister: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో చోరీ.. చెవి రింగులతో దొరికిపోయిన ‘ఇంటి దొంగ’..
Salman Khan's Sister Arpita Khan

Salman Khan’s Sister: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఇంట్లో చోరి జరిగింది. అర్పితా ఖాన్ తన మేకప్ ట్రేలోని 5 లక్షల విలువైన చెవిపోగులు మాయమైయ్యాయంటూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్పిత చేసిన ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇంట్లోని పనిమనిషిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ పనిమనిషిని విచారించి అతని నుంచి అర్పితా ఖాన్‌కు చెందిన వజ్రాల చెవిపోగులను ముంబై పోలీసులు రికవరీ చేశారు.

అర్పితా ఖాన్ ఇంట్లో పని చేసే 30 ఏళ్ళ సందీప్ హెగ్డేని దొంగతనం కారణంగా అరెస్ట్ చేశామని ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ మోహన్ మానే తెలిపారు. ఇంకా అర్పితా ఖాన్ ఇంట్లో సందీఫ్ హెగ్దేతో సహా 11 మంది పని చేస్తారని, అయితే ఆభరణాలు దొంగిలించి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పరారయ్యాడని విచారణలో తేలిందన్నారు. ఈ క్రమంలో సందీప్ నుంచి చెవి పోగులు రికవరీ చేసి అతనిపై సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

కాగా, సల్మాన్‌ ఖాన్‌కి సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ అనే ఇద్దరు సోదరులు, ఇంకా అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, అర్పితా ఖాన్(అడాప్టెడ్) అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.