Most Recent

Rowdy Rohini: హాస్పిటల్‌లో రౌడీ రోహిణి..10 గంటల సర్జరీ.. భయంతో ఏడ్చేసిన నటి

Rowdy Rohini: హాస్పిటల్‌లో రౌడీ రోహిణి..10 గంటల సర్జరీ.. భయంతో ఏడ్చేసిన నటి
Rohini

ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ తమ ప్రతిభను చాటుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమెడియన్స్ గా మగాళ్లు మాత్రమే కాదు..ఆడవారు కూడా తమ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది లేడీ కమెడియన్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు వారిలో రోహిణి ఒకరు. ప్రముఖ టీవీ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్ షో ద్వారా రోహిణి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆమె తన చలాకీ తనంతో .. కామెడీ టైమింగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రోహిణి. పలు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు రోహిణి. ఇదిలా ఉంటే రోహిణి తాజాగా ఆసుపత్రి పాలు అయ్యారు. చాలా క్రితం రోహిణి ఓ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సమయంలో ఆమె కాలుకు తీవ్ర గాయం అయ్యింది. దాంతో ఆమె కుడి కాలులో రాడ్డు వేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ రాడ్డు తొలగించాలని అన్నారు.

కానీ రోహిణి కెరీర్ లో బిజీగా ఉండటంతో ఆ రాడ్డు తొలగించలేదు. అయితే ఇప్పుడు ఆమెకు సమయందొరకడంతో హాస్పటల్ కు వెళ్ళారు. అయితే ఆమె కాలులో రాడ్డు తొలగించడం చాలా కష్టమైంది. దాంతో హైదరాబాద్ లోని డాక్టర్స్ మావల్ల కాదు అంటూ చేతులెత్తేశారు. ఆ తర్వాత ఆమె తనకు ముందుగా సర్జరీ చేసిన డాక్టర్స్ ను సంప్రదించగా..

దాదాపు 10 గంటలు కష్టపడి రాడ్డును తీశారు. గంటలో అయిపోతుందనుకున్న సర్జరీ 10 గంటలు పట్టడంతో రోహిణి చాలా భయపడిపోయారట. డాక్టర్స్ తనతో మాట్లాడుతున్న సమయంలో చాలా భయమేసిందని.. ఏడ్చేశాను అని అన్నారు రోహిణి. ఈ విషయాన్నీ తన యూట్యూబ్ ఛానెల్ లో తెలిపారు రోహిణి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.