Most Recent

Rashmi Gautham: చైతన్య మాస్టర్‌ సూసైడ్‌పై స్పందించిన యాంకర్‌ రష్మీ.. చావు పరిష్కారం కాదంటూ ఎమోషనల్‌

Rashmi Gautham: చైతన్య మాస్టర్‌ సూసైడ్‌పై స్పందించిన యాంకర్‌ రష్మీ.. చావు పరిష్కారం కాదంటూ ఎమోషనల్‌
Chaitanya Master

ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌, ఢీ షో కొరియోగ్రాఫర్‌ ఆత్మహత్య అందరినీ కలిచివేసింది. డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎంతో భవిష్యత్‌ ఉన్న ఆయన హఠాత్తుగా బలవన్మరణానికి పాల్పడడం సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు చైతన్య మాస్టర్‌. కాగా మాస్టర్‌ మరణంతో అతని కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. అతనితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ఢీ షోలో చైతన్య మాస్టర్‌తో కలిసి పని చేసిన శేఖర్‌ మాస్టర్‌, శ్రద్ధాదాస్‌, పలువురు డ్యాన్స్‌ మాస్టర్లు ఇప్పటికే చైతన్యకు సోషల్‌ మీడియా వేదికగా నివాళి అర్పించారు. అతను ఎప్పుటికి తమ మనసుల్లో నిలిచిపోతాడన్నారు. తాజాగా బుల్లితెర యాంకర్‌, గతంలో ఢీ షోలో సందడి చేసిన రష్మీ గౌతమ్‌ చైతన్య మాస్టర్‌ మరణంపై స్పందించింది. ‘ నీ సమస్యకు ఇది పరిష్కారం కాదు చైతన్య. నీ కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంది రష్మీ.

కాగా అప్పుల కారణంగానే చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడన్నవార్తలపై అతని స్నేహితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయేంత ఆర్థిక సమస్యలు అతనికి లేవంటున్నారు. అదే నిజమైతే తాము ఏదోలా సాయం చేసేవాళ్లమంటున్నారు. ఓ షోకి సంబంధించి టైటిల్ మిస్‌ అయిందన్న బాధతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చంటున్నారు. మొత్తానికి చైతన్య మరణం బుల్లితెరను విషాదంలోకి నెట్టివేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.