Most Recent

Ramabanam: గోపిచంద్‌ రామబాణం మూవీని రిజెక్ట్‌ చేసిన మెగా హీరో! ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Ramabanam: గోపిచంద్‌ రామబాణం మూవీని రిజెక్ట్‌ చేసిన మెగా హీరో! ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Ramabanam Movie

ఒక హీరో కథలతో మరో హీరో సినిమాలు చేయడం ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా సర్వసాధారణం. అందుకు ఎన్నో కారణాలు, లెక్కలుంటాయి. అందులో కొన్ని మూవీస్‌ సూపర్‌ హిట్‌గా నిలిస్తే.. మరికొన్ని బాక్సాఫీస్‌ దగ్గర ఫెయిల్‌ అవుతుంటాయి. వివరాల్లోకి వెళితే.. మ్యాచో స్టార్‌ గోపిచంద్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం రామబాణం. డింపుల్‌ హయతి హీరోయిన్‌. శ్రీవాస్‌ దర్శకత్వం వహించాడు. జగపతి బాబు, ఖుష్బు ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన రామబాణం శుక్రవారం (మే 5) విడుదలైంది. అయితే ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా గోపిచంద్‌ అభిమానులను అలరించినప్పటికీ, సగటు ప్రేక్షకుడిని మాత్రం నిరాశపరిచింది. అయితే పోటీలో విరూపాక్ష తప్ప ఇతర సినిమాలేవి లేకపోవడంతో గోపిచంద్‌ సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే రామబాణం సినిమా గురించి సోషల్‌ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్‌ చేస్తోంది. అదేంటంటే.. మొదట గోపిచంద్‌ చేయాల్సిన ఈ మూవీ ఒక మెగా హీరో దగ్గరికి వెళ్లిందట. అతను మరెవరో కాదు.. మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌.

రామబాణం కథను సిద్ధం చేసుకున్నప్పుడే దర్శకుడు శ్రీవాస్‌ మొదట వరుణ్‌ తేజ్‌ దగ్గరకు వెళ్లారట. మాస్‌ అండ్‌ యాక్షన్‌ మూవీ కావడంతో ఒడ్డు, పొడవు ఉన్న వరుణ్‌ అయితే బాగుంటుందని డైరెక్టర్‌ అనుకున్నాడట. అనుకున్నట్టుగానే స్టోరీని వరుణ్‌కి చెప్పాడట. అయితే ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా ఉండడం, భారీ ఎమోషన్ సీన్లు తనకు సూట్ కావని ఈ సినిమాను వద్దన్నాడట. దీంతో మరోసారి తన లక్కీ హ్యాండ్‌ అయిన గోపిచంద్‌ దగ్గరికి వెళ్లారట. ఆయన కథను విని ఓకే చెప్పడం, సినిమా సెట్స్‌పైకి వెళ్లడం చకా చకా జరిగిపోయాయట. కాగా రామబాణం సినిమాలో రెగ్యులర్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ గోపిచంద్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయని టాక్‌ వినిపిస్తోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Gopichand (@yoursgopichand)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.