Most Recent

Pooja Hegde: పూజకు ఎలాంటి భర్త కావాలంటే.. ఆసక్తికర విషయాలు పంచుకున్న తల్లి లతా.

Pooja Hegde: పూజకు ఎలాంటి భర్త కావాలంటే.. ఆసక్తికర విషయాలు పంచుకున్న తల్లి లతా.
Pooja Hegde

తమిళ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైంది అందాల తార పూజాహెగ్డే. అనంతరం 2014లో వచ్చిన ఒక లైలా చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిందీ బ్యూటీ. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిందీ చిన్నది. తాజాగా సల్మాన్‌ ఖాన్‌తో కలిసి నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో పాగా వేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మదర్స్‌ డే సందర్భంగా ఆదివారం పూజా హెగ్డే తన తల్లి లతతో కలిసి ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పూజా తల్లి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

పూజకి కాబోయే భర్త ఎలా ఉండాలన్న ప్రశ్నకు లత బదులిస్తూ.. ‘పూజను అన్ని రకాలుగా అర్థం చేసుకునే వ్యక్తి గురించి ఎదురు చూస్తోంది. పెళ్లి అనే బంధం కలకాలం నిలిచి ఉండాలంటే భార్యాభర్తలిద్దరి భాగస్వామ్యం ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. గౌరవం ఇవ్వని వ్యక్తితో కలిసి ఉండటం చాలా కష్టం. ఆ బంధం నిలవదు. పూజ చాలా సున్నిత మనస్కురాలు. తన ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త తీసుకునే వ్యక్తి కావాలి. అతడు స్ఫూర్తిగా నిలవాలి. కెరీర్‌ని ప్రోత్సహించాలి. అలాంటి అబ్బాయినే తను కోరుకుంటోంది’ అని లత చెప్పుకొచ్చారు.

ఇక తల్లి మాటలతో పూజా సైతం ఏకీభవించింది. అలాగే తల్లితో తనకున్న అనుభవం గురించి పంచుకుంది. తన జీవితంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి తల్లే అని చెప్పుకొచ్చిన పూజా..తన అమ్మ కలలన్నీ నేను నెరవేర్చాననే అనుకుంటున్నానని తెలిపింది. ఇక తనకోసం చేసిన ప్రతీ పనికి కృతజ్ఞతలు అంటూ తల్లిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసింది. ఇక కెరీర్‌ విషయానికొస్తే పూజా ప్రస్తుతం తెలుగులో మహేష్‌ బాబు సరసన నటిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో పాటు హిందీలోనూ ఓ సినిమాలో నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.