Most Recent

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బ్రో సినిమా క్రేజ్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బ్రో సినిమా క్రేజ్.. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ
Bro Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ బ్రో. తమిళ్ సినిమా అయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఈ క్రేజీ కాంబో కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విలక్షణ నటుడు సాముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ ను రీసెంట్ గా రివీల్ చేశారు. ఈ సినిమాకు బ్రో అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్.. లక్షల్లో లైక్స్ వచ్చాయి ఈ మోషన్ పోస్టర్ కు.. ఇక ఈ సినిమాలో పవన్ దేవుడిగా కనిపించనున్నారు. గతంలో వచ్చిన గోపాల గోపాల ఇనిమలో పవన్ కృష్ణుడిగా కనిపించిన విషయం తెలిసిందే..

సాముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేఅందిస్తున్నారు . తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమా కథలో చాలా మార్పులు చేశారు. మన ఆడియన్స్ కు కావాల్సిన ఎలివేషన్స్ తో పాటు చాలా మార్పులు చేశారు ఈ సినిమాలో.. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ హక్కులకు సంబందించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

బ్రో సినిమా ఓటీటీ రేట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ తో కలిసి జీ స్టూడియోస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ హక్కులను మాత్రం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు బ్రో మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. బ్రో మూవీ జులై నెలాఖరున థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.