Most Recent

NTR Satajayanthi Utsavalu: ఘనంగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. భారతరత్న ఇవ్వాలని డిమాండ్..

NTR Satajayanthi Utsavalu: ఘనంగా జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. భారతరత్న ఇవ్వాలని డిమాండ్..
Ntr Satajayanthi Utsavalu

ఎన్టీఆర్‌కు భారతరత్న డిమాండ్‌ మరోమారు తెరమీదకు వచ్చింది. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావుకి భారత రత్న ఇవ్వాలని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కూకట్ పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్స్ లో శఖ పురుషుడి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. సినీ రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వేడుకల్లో నట సార్వభౌముడిని స్మరించుకోవడంతో పాటు ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన వారు, సినిమా వైద్య రంగాల్లో విశేష సేవ చేస్తున్న వారికి సత్కారాలు నిర్వహించారు.

పార్టీలకు అతీతంగా ఒకే స్టేజీ మీదకు వచ్చిన వారంతా ఎన్టీఆర్‌ అవార్డుకు అర్హుడని నినదించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ను గుర్తించాలని కోరారు. అవార్డు వచ్చేంత వరకు పోరాటం కూడా చేయాలని మరి కొందరు పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో భారతరత్న డిమాండ్‌ మారుమోగింది. మహానేతకు దేశంలోనే అత్యుత్తమ పురస్కారం ఇవ్వాలని ఫ్యాన్స్‌ నుంచి అగ్ర నేతల వరకు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు.

ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చే విధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు దర్శకుడు, రచయిత ఆర్‌.నారాయణమూర్తి. శతజయంతి వేడుకలు జరుపుకుంటున్న ఎన్టీఆర్‌కు ఈ నెల 28 వరకైనా కేంద్రం భారతరత్నను ప్రకటించాలని కోరారు మాజీ ఎంపీ మురళీమోహన్‌.

ఎన్టీఆర్‌కు భరతరత్నా ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చివరి కోరిక కూడా అదేనన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన నటీమణులు జయప్రద, జయసుధ, ప్రభ,రోజా రమణి వంటి వారితో పాటు ఘట్టమనేని ఆది శేషగిరి రావు సహా ప్రొడ్యూసర్ లు , టెక్నీషియన్ లను సత్కరించారు.

ఇక, సినీ పరిశ్రమ నుంచి అలనాటి నటుల నుంచి ఈనాటి యువతరం హీరోల వరకూ ఈ సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకున్నారు. అల్లు అరవింద్‌, వెంకటేష్‌, రామ్‌చరణ్‌, అడివి శేష్‌, నాగచైతన్య, డీజే టిల్లు హీరో సిద్ధూ, విశ్వక్‌సేన్ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. కర్నాటక నుంచి వచ్చిన హీరో శివరాజ్‌కుమార్‌ స్టేజ్‌పై ప్రత్యేకంగా కనిపించారు. ఈ వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరిని నిర్వాహకులు సత్కరించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.