Most Recent

Modern Love Chennai: అమెజాన్ ప్రైమ్‏లో ‘మోడ్రన్ లవ్ చెన్నై’.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే..

Modern Love Chennai: అమెజాన్ ప్రైమ్‏లో ‘మోడ్రన్ లవ్ చెన్నై’.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే..
Modern Love Chennai

మోడ్రన్ లవ్ చెన్నై.. తమిళనాడులోని ప్రస్తుత కాలంలోని ప్రేమకథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన వెబ్ సిరీస్. దాదాపు ఆరు ఎపిసోడ్‏లుగా రూపొందిన ఈ సిరీస్‏కు ఒక్కో ఎపిసోడ్‏కు ఒక్క దర్శకుడు డైరెక్షన్ చేయడం విశేషం. టైలర్‌ డర్డన్‌ అండ్‌ కినోఫీస్ట్‌ సంస్థ నిర్మించిన ఈ వెబ్‌ సీరీస్‌కు త్యాగరాజన్‌ కుమారరాజా నిర్వహణ బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఒక ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించారు. ఆయనతోపాటు.. డైరెక్టర్ భారతీ రాజా, బాలాజీ శక్తివేల్, రాజు మురుగన్, అక్షయ్ సుందర్, కృష్ణ కుమార్, రామ్ కుమార్ ఆరుగులు డైరెక్టర్స్ వర్క్ చేశారు. ఇంగ్లిష్‏లో మోడ్రన్‌ లవ్‌ పేరుతో రూపొంది విశేష ప్రేక్షకాదరణను పొందిన ఈ అంథాలజీ వెబ్‌ సీరీస్‌ను మోడ్రన్‌ లవ్‌ చైన్నె పేరుతో రీమేక్‌ చేశారు. ఇది ప్రేమను వివిధ కోణాల్లో ఆవిష్కరించే వెబ్ సిరీస్ అని డైరెక్టర్ త్యాగరాజన్ కుమారరాజా పేర్కొన్నారు. ఈ అంథాలజీ వెబ్ సిరీస్ మే 18 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవల చెన్నైలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ మీడియా సమావేశంలో డైరెక్టర్ భారతీ రాజా మాట్లాడుతూ.. తాను సంప్రదాయం కలిగిన వ్యక్తినన్నారు.

50 ఏళ్లుగా పలు చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ వచ్చానని.. సరికొత్త ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించాలన్న తన ఆసక్తి డైరెక్టర్ త్యాగరాజన్ కుమార్ రాజా ద్వారా ఈ అంథాలజి వెబ్ సిరీస్ తో నెరవేరిందని అన్నారు. ప్రేమలేని జీవితం ఉండదన్నారు. జీవితంలో ప్రేమలో పడనివాడు కళాకారుడు కాలేడని అన్నారు. ప్రేమకు ఫిదా సినిమా అంటూ ఉండదని.. ప్రేమ చాలా గొప్పదని పేర్కొన్నారు.

ఇందులో రరీతూ వర్మ, రమ్య నంబేసన్, అశోక్ సెల్వన్, వామిక, సంజులా సారథి, శ్రీకృష్ణ దయాల్, TJ భాను, శ్రీ గౌరీ ప్రియ, వాసుదేవన్ మురళి, వసుంధర, సంయుక్త విశ్వనాథన్, పవన్ అలెక్స్, అనిరుత్ కనకరాజన్, కిషోర్, విజయలక్ష్మి తదితరులు కీలకపాత్రలలో నటించగా.. ఇళయరాజా, యువన్ శంకర రాజా, సీన్ రోల్డాన్, జివి ప్రకాష్ సంగీతం అందించారు. సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా ఈ సిరీస్‌లోని అన్ని విభాగాలను చిత్రీకరించారు. మోడరన్ లవ్ చెన్నై మే 18న ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.