

సినిమాలతో కంటే కాంట్రవర్సీ కామెంట్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ఈ అమ్మడు ఎక్కడ ఉంటే అక్కడ ఎదో ఒక వార్త పుట్టుకొస్తుంది. కంగనా బాలీవుడ్ సెలబ్రెటీస్ నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవ్వరిని వదిలిపెట్టలేదు. సమాజంలో జరిగే విషాయాల పై నిత్యం స్పందిస్తూ ఉంటుంది. అలాగే తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల గురించి కూడా పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది కంగనా. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసి అందరికి షాక్ ఇచ్చింది ఈ భామ . సోషల్ మీడియాలో కంగనా చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ట్విటర్ వేదికగా ఈ అమ్మడు అందరి పై కామెంట్స్ చేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా ట్విటర్ సీఈవో ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ పై స్పందించింది కంగనా.
ఎలన్ మస్క్ ఇటీవల చేసిన ‘నాకు నచ్చిందే చెప్తాను’ కామెంట్‌ను ప్రశంసించింది కంగనా. యాంటి నేషనల్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల తనకు 25 బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు పోయాయని చెప్పింది కంగనా. అలా మాట్లాడటం వల్ల రాత్రికి రాత్రే తనను తొలగించారని చెప్పుకొచ్చింది. దాని వల్ల కొట్లలో నష్టం వచ్చిందని తెలిపింది కంగనా
హిందుత్వం కోసం.. అసలైన స్వేచ్ఛ కోసం.. రాజకీయ నాయకులు,తుక్డే గ్యాంగ్ కు వెతిరేకంగా నేను మాట్లాడాను. దాని వల్ల. నా 20-25 బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ పోయాయి. ఆ ప్రాజెక్ట్స్ నుంచి నన్ను రాత్రికి రాత్రే తీశేశారు. దీంతో ఏడాదికి రూ. 30-40 కోట్ల వరకు నష్టపోయాను చెప్పుకొచ్చింది కంగనా.