Most Recent

Jagapathi Babu: చద్దన్నం.. అవకాయ పచ్చడి.. జగ్గూభాయ్‌హెల్త్‌ సీక్రెట్‌ ఇదేనా? వైరలవుతోన్న పోస్ట్‌

Jagapathi Babu: చద్దన్నం.. అవకాయ పచ్చడి.. జగ్గూభాయ్‌హెల్త్‌ సీక్రెట్‌ ఇదేనా? వైరలవుతోన్న పోస్ట్‌
Jagapatibabu

ప్రస్తుతం టాలీవుడ్‌లో ది మోస్ట్‌ బిజియెస్ట్‌ యాక్టర్లలో జగపతిబాబు ఒకరు. విలన్‌గా, స్పెషల్‌ రోల్స్‌తో సందడి చేస్తోన్న ఆయన చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. ఇటీవలే రామబాణం సినిమాలో గోపిచంద్‌ అన్నయ్య పాత్రలో నటించి మెప్పించారాయన. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇటీవల సోషల్ మీడియలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా మారిపోయారు జగ్గూ భాయ్‌. కొన్ని నెలల క్రితం వరకు ఆయనకు సోషల్‌ మీడియా అకౌంట్లే ఉండేవి కాదు. అలాంటిది ఇప్పుడు ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇంట్రెస్టింగ్‌ పోస్టులు షేర్‌ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. తాజాగా మరో ఆసక్తికరమైన ఫొటోను షేర్‌ చేశారీ ఫ్యామిలీ హీరో. ఆవకాయ పచ్చడితో అన్నం తింటోన్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘ ఏ దేశం వెళ్లినా.. సద్దన్నంలో ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే ఆ మజానే వేరు. ‘మా అత్తగారు ఇచ్చిన ఆవపిండి కలిపిన ఆవకాయ పచ్చడి పొద్దునే కలుపుకొని తింటున్నా’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు జగపతి బాబు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘జగ్గూభాయ్‌ ఎంజాయ్‌’ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవలే రామబాణంలో సందడి చేసిన ప్రభాస్‌ సలార్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మహేశ్‌ బాబు ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28లో కూడా ఓ కీ రోల్‌లో నటించనున్నారు. అలాగే త్రిష రుద్రాంగి, అల్లు అర్జున్‌ పుష్ప 2 చిత్రాలు కూడా జగ్గూభాయ్‌ చేతిలో ఉన్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

 

View this post on Instagram

 

A post shared by Jaggu Bhai (@iamjaggubhai_)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.