Most Recent

ప్రముఖ నటుడు అనుమానాస్పద మృతి.. అపార్ట్‌మెంట్‌ బాత్రూంలో విగతజీవిగా..!

ప్రముఖ నటుడు అనుమానాస్పద మృతి.. అపార్ట్‌మెంట్‌ బాత్రూంలో విగతజీవిగా..!
Aditya Singh Rajput

ప్రముఖ నటుడు, మోడల్‌ ఆదిత్యసింగ్‌ రాజ్‌పుత్‌ (32) సోమవారం మధ్యాహ్నం (మే 22) అనుమానాస్పద స్థితితో మృతిచెందాడు. ముంబాయ్‌లోని అతని అపార్ట్‌మెంట్ బాత్రూంలో విగతజీవిగా పడివున్నాడు. అతని స్నేహితుడు గమనించి అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ సాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆదిత్యసింగ్‌ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. డ్రగ్స్ ఓవర్‌ డోస్‌ కారణంగా మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అతని మరణానికి కారణం తెలిసే అవకాశం ఉందన్నారు. ఆదిత్యసింగ్‌ డ్రగ్స్‌ ఓవర్‌ డోస్‌ కావడం వల్ల మరణించాడా? లేదంటే మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆదిత్య సింగ్, ఆ తర్వాత పలు బాలీవుడ్‌ మువీల్లో, వాణిజ్య ప్రకటనల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎందరో నటులతో కలిసి అనేక బ్రాండ్‌లకు పనిచేశాడు. దాదాపు 300 ప్రకటనలు, 9 రియాల్టీ షోలలో పనిచేశాడు. లవ్, ఆషికి, కోడ్ రెడ్, ఆవాజ్ సీజన్ 9, బ్యాడ్ బాయ్ సీజన్ 4 వంటి పలు టీవీ కార్యక్రమాలతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.

ముంబై గ్లామర్ సర్క్యూట్‌లో ఆదిత్య సింగ్ బాగా ఫేమస్‌. పార్టీలు, పేజీ 3 ఈవెంట్‌లలో రెగ్యులర్‌గా కనిపిస్తుంటాడు. ఆదిత్య సింగ్ మరణం పట్ల బాలీవుడ్‌ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.