Most Recent

Amrita Rao: కేవలం లక్షన్నరతో పెళ్లి చేసుకున్న ‘అతిథి’ హీరోయిన్‌.. వెడ్డింగ్‌ శారీ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారంతే

Amrita Rao: కేవలం లక్షన్నరతో పెళ్లి చేసుకున్న ‘అతిథి’ హీరోయిన్‌.. వెడ్డింగ్‌ శారీ ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారంతే
Amrita Rao, Rj Anmol

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురుమైన ఘట్టం. వీలైనంతవరకు అందరికీ గుర్తుండిపోయేలా అట్టహాసంగా తమ పెళ్లి జరుపుకోవాలని అందరూ కలలు కంటారు. ఇక సెలబ్రిటీల పెళ్లి వేడుకల గురించి చెప్పనక్కర్లేదు. సంగీత్‌, మెహెందీ, విందులు, వినోదాలు, వెడ్డింగ్ ఫొటోషూట్స్‌.. ఇలా ఎంతో ఆడంబరంగా సినిమా తారల పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఇందుకోసం కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చు పెడుతుంటారు. అయితే తాను ఇలాంటి ఆడంబరాలకు చాలా దూరమంటోంది బాలీవుడ్‌ బ్యూటీ అమృతారావు. వివాహ్‌, హే బేబీ, వెల్కమ్‌ టు సజ్జన్‌ పూర్‌, లైఫ్‌ పార్ట్‌నర్‌, జాలీ ఎల్‌ఎల్‌బీ, సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌, సత్యాగ్రహ, థాకరే వంటి సినిమాలతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుందామె. ఇక టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా ఈ సొగసరి పరిచయమే.మహేశ్‌ బాబు నటించిన ‘అతిథి’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది అమృత. అయితే సినిమా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే 2016లో ఆర్జే అన్ మోల్ ను అమృత పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైన అమృతారావు తన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. ముఖ్యంగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ కేవలం లక్షన్నర రూపాయల ఖర్చుతోనే వివాహం చేసుకున్నానని తెలిపింది.

‘కొద్దిమంది దగ్గరి బంధువులు, మిత్రుల సమక్షంలోనే మా పెళ్లి జరిగింది. పెళ్లి తంతు కోసం మేం కేలవం రూ. 1.5లక్షలు మాత్రమే ఖర్చు చేశాం. పెళ్లి బట్టలు, ప్రయాణ ఖర్చులు, కల్యాణ వేదిక.. ఇవన్నీ ఆ డబ్బుతోనే సర్దుకున్నాం. పెళ్లికి నేను ధరించిన చీర ధర కేవలం రూ.3000 మాత్రమే. ఇక పెళ్లి వేదిక కోసం రూ. 11 వేలు ఖర్చు చేశాం. భోజనాలు, ప్రయాణ ఖర్చులతో కలిపి మొత్తం లక్షన్నరలో మా పెళ్లి జరిగిపోయింది. మొత్తంగా తమ పెళ్లి ఖర్చు లక్షన్నరకు మించలేదు. పెళ్లి అనేది ప్రేమతో కూడి ఉండాలి కానీ, డబ్బు, హంగూ ఆర్భాటాలతో కాదు’ అని చెప్పుకొచ్చింది అమృత. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోందీ అమృత. ఆమె చివరిగా థాకరే అని సినిమాలో నటించింది.

 

View this post on Instagram

 

A post shared by RJ Anmol (@rjanmol27)

 

 

View this post on Instagram

 

A post shared by AMRITA RAO 🇮🇳 (@amrita_rao_insta)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.