Most Recent

Amitabh Bachchan: ‘నువ్వు ఎవరో తెలీదు మిత్రమా.. కానీ థాంక్స్’.. అమితాబ్ బచ్చన్ ఇన్ స్టా పోస్ట్ వైరల్..

Amitabh Bachchan: ‘నువ్వు ఎవరో తెలీదు మిత్రమా.. కానీ థాంక్స్’.. అమితాబ్ బచ్చన్ ఇన్ స్టా పోస్ట్ వైరల్..
Amitabh Bachan

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్‏కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లోనే సూపర్ స్టార్‏గా గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బీ.. ఎంతో సింప్లిసిటీ.. నిరాడంబరతతోనూ అభిమానుల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. ఇక సినిమా అంటే అమితాబ్‏కు చెప్పలేనంత ఇష్టం. కేవలం హీరోగానే కాదు.. కంటెంట్ నచ్చితే సహాయ నటుడిగా చేసేందుకు సైతం వెనకడారు. హిందీలోనే కాకుండా… తెలుగులోనూ పలు చిత్రాల్లో కీలకపాత్రలలో నటించారు. ప్రస్తుతం ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే షూటింగ్ సెట్‏లో ఆయన సమయపాలన కచ్చితంగా మెయిన్ టెన్ చేస్తారు. ఈ క్రమంలో తాజాగా ట్రాఫిక్ జామ్ కారణంగా షూటింగ్‍కు ఆలస్యం కావడంతో ఓ బైకర్ సాయం తీసుకున్నారు. అపరిచిత వ్యక్తి బైక్ పై తన గమ్యస్థానానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని స్యయంగా బిగ్ బీనే సోషల్ మీడియాలో వెల్లడించారు.

“నువ్వు ఎవరో నాకు తెలీదు మిత్రమా.. కానీ నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా మాట మన్నించి కోరుకున్న చోట నన్ను డ్రాప్ చేశావు. ట్రాఫిక్ జంఝాటాన్ని తప్పించి వేగంగా గమ్యస్థానానికి చేర్చావు. నీకు మరోసారి థాంక్స్ ” అని బిగ్ బీ పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. దీనిపై ఆయన మనవరాలు నవ్య నందా స్పందిస్తూ. హార్ట్ ఎమోజీని షేర్ చేశారు.

అలాగే తన బ్లాగ్ లో అమితాబ్ ‘మేము చేసే పనికి కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అనుమతులు ఇస్తారు. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కారణంగా వెళ్లలేకపోయాను. చాలా కాలం తర్వాత బైక్ పై ప్రయాణించడం.. డ్రైవింగ్ ఉత్సాహంగా ఉంది.. ఈ రైడ్ ఎప్పటికీ మర్చిపోను” ఇలా రాసుకొచ్చారు. ఇక అమితాబ్ షేర్ చేసిన ఫోటోపై నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.