Most Recent

Sitara: సితారకు అలియా భట్‌ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌.. మురిసిపోయిన మహేశ్‌ గారాల పట్టి.. ఫొటోస్ వైరల్‌

Sitara: సితారకు అలియా భట్‌ సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌.. మురిసిపోయిన మహేశ్‌ గారాల పట్టి.. ఫొటోస్ వైరల్‌
Alia Bhatt, Sitara

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యూటీ అలియా భట్‌ సినిమాలతో పాటు బిజినెస్‌లోనూ దూసుకెళుతోన్న సంగతి తెలుస్తోందే. గర్భంతో ఉన్నప్పుడే ఎడ్-ఎ-మమ్మా అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించింది అలియా. 2 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు అవసరమైన దుస్తులను ఈ స్టార్టప్‌ కంపెనీ విక్రయిస్తోంది. ఈ సంస్థ వెబ్‌సైట్‌లో సుమారుగా 800లకు పైగా కిడ్‌ వేర్‌ ప్రొడక్ట్స్‌ ఉన్నాయి. కాగా గతంలో జూనియన్‌ ఎన్టీఆర్‌ పిల్లలకు స్టైలిష్‌ డ్రెస్సులు పంపిన అలియా తాజాగా మహేశ్‌బాబు కూతురు సితారకు కూడా అదిరిపోయే అవుట్‌ ఫిట్‌ పంపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేసింది సితార. అలియా పంపిన దుస్తులు ధరించిన మహేశ్‌ కూతురు ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది ‘మీ ఫ్యామిలీలో నన్ను ఒకరిగా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. మీ బహుమతులు నాకు ఎంతగానో నచ్చాయి’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం సితార ఫొటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

ఇక సితారా ఘట్టమనేనికి సోషల్‌ మీడియాలో ఎంతటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తను షేర్‌ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన వస్తుంటుంది. ఇక సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ను కూడా మెయింటైన్‌ చేస్తోందీ స్టార్‌ కిడ్‌. పలువురు ప్రముఖులను ఆమె ఇంటర్వ్యూ చేసిన వీడియోలు ఇందులో ఉన్నాయి. కాగా మహేశ్‌ నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషనల్ సాంగ్‌లో సితార స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. త్వరలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టనుందని సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by sitara 💌 (@sitaraghattamaneni)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.