Most Recent

Shivathmika Rajashekar: ఎల్లోరా శిల్పంలా ఫోటోలకు ఫోజులిచ్చిన శివాత్మిక.. ఇలా అయితే కుర్రాళ్ళు ప్రేమలో పడకుండా ఉంటారా..?

Shivathmika Rajashekar: ఎల్లోరా శిల్పంలా ఫోటోలకు ఫోజులిచ్చిన శివాత్మిక.. ఇలా అయితే కుర్రాళ్ళు ప్రేమలో పడకుండా ఉంటారా..?
Shivathmika Rajashekar

సీనియర్ హీరో రాజశేఖర్ వారసురాళ్లుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు శివాని, శివాత్మిక. దొరసాని సినిమాతో శివాత్మిక హీరోయిన్ గా పరిచయం అయితే.. అద్భుతం అనే సినిమాతో శివాని ఎంట్రీ ఇచ్చారు. వీరిలో శివాత్మిక బాగానే క్లిక్ అయ్యారని చెప్పొచ్చు. ఆచితూచి కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. రీసెంట్ గా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది.

హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తోన్న శివాత్మిక ఛాన్స్ దొరికినప్పుడల్లా.. అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. నెట్టింట తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఇక రకరకాల ఫోటో షూట్స్ తో ఈ చిన్నది చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

తాజాగా మరోసారి తన వయ్యారాలు ఒంపుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ కుర్రది. బ్లూ కలర్ శారీలో కేక పుట్టించింది ఈ అందాల భామ. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోల పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎల్లోరా శిల్పంలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రకారు. ఈ చిన్నదాని స్టైన్నింగ్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.

 

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.