

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో శకుంతలగా సామ్.. దుష్యంతుడిగా మలయాళీ యువ హీరో దేవ్ మోహన్ నటించగా.. భరతుడి పాత్రలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ బాలనటిగా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. గత నెల రోజులుగా వరుసగా ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ అంటూ ప్రేక్షకులలో ఆసక్తిని క్రియేట్ చేశారు శాకుంతలం చిత్రబృందం. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా.. డైరెక్టర్ గుణశేఖర్ డాటర్ నీలిమ గుణ నిర్మించారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాల, అనన్య నాగళ్ల కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా ఈరోజు (ఏప్రిల్ 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. శకుంతల.. దుష్యంతుల ప్రేమకథా ఎలా ఉందంటే..
Introducing AlluArha
All The Best For @alluarjun ‘s Little Princess #Arha on her Big Screen Debut with #Shaakuntalam
pic.twitter.com/6JfN365W5K
— Allu Arjun TFC
(@AlluArjunTFC) April 13, 2023
Delhi
The audience loves #Shaakuntalam
Releasing tomorrow
Book your tickets now!!https://t.co/zZSt4eoRhR pic.twitter.com/ueKN4HT49B— Samantha (@Samanthaprabhu2) April 13, 2023
Good One! Should have trimmed few #Shaakuntalam https://t.co/z1r6r1mXW3
— rajesh! (@rajeshsurneni03) April 14, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

(@AlluArjunTFC) 