Most Recent

Sampath J Ram: ప్రముఖ నటుడు అనుమానస్పద మృతి.. ఆత్మహత్యనా? మరేదైనా కారణమా?

Sampath J Ram: ప్రముఖ నటుడు అనుమానస్పద మృతి.. ఆత్మహత్యనా? మరేదైనా కారణమా?
Kannada Actor Sampath J Ram

కన్నడ సినీ నటుడు.. సంపత్‌ జె హఠాన్‌ మరణం చెందారు. సంపత్‌ జె తన నివాసంలోనే శవమై కనిపించడం సంచలనం రేకెత్తిస్తోంది. అనేక సినిమాల్లో నటించిన యువ నటుడు.. బుల్లితెర పైనా ప్రేక్షకులను మెప్పించిన సంపత్‌ జే ఇకలేరన్న వార్త కన్నడనాట విషాదాన్ని నింపింది.

ప్రముఖ కన్నడ నటుడు సంపత్‌ జె రామ్‌ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమల విషాదంలో మునిగిపోయింది. అగ్ని సాక్షి టీవీ షోతో పాటు.. ఇటీవలే విడుదలైన శ్రీబాలజీ ఫొటో స్టూడియో సినిమాలో కనిపించిన యువ నటుడు రెండు రోజుల క్రితం నేలమంగళంలోని తన ఇంట్లోనే మృత్యువాత పడ్డారు. 35 ఏళ్ళ సంపత్‌ జె సూసైడ్‌ చేసుకొని ఉంటాడన్న వార్తలు సంచలనంగా మారాయి.

సంపత్‌కు ఏడాది క్రితమే వివాహం జరిగింది. కొంత కాలంగా సంపత్‌ జె రామ్‌ మానసికంగా ఒత్తిడిని ఎదుర్కుంటున్నట్టు తెలుస్తోంది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడం పట్ల నిరాశగా ఉన్నాడని.. బహుశా అదే ఆత్మహత్యకు దారితీసి ఉంటుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

సంపత్‌ మరణ వార్తను దర్శకుడు, నటుడు రాజేష్‌ ధృవ ఫేస్‌బుక్‌లో పెట్టారు. సంపత్‌ ఫొటోలు షేర్‌ చేసిన రాజేష్‌.. మిత్రుడి మరణవార్తతో పాటు హృదయాన్ని మెలిపెట్టే పోస్ట్‌ పెట్టారు. ‘నువ్వు లేవన్న నిజాన్ని భరించే శక్తి లేదనీ, ఇంకా ఎన్నో సాధించాల్సి ఉందనీ, స్వప్న సాకారానికి ఇంకా సమయం ఉందనీ, నిన్ను మరింత ఎత్తులో చూడాలన్న ఆశ మిగిలేఉందనీ.. ప్లీజ్‌ కమ్‌బ్యాక్‌’ అంటూ పోస్ట్‌ పెట్టాడు.

కన్నడనాట సంపత్‌ జె నటించిన ‘అగ్ని సాక్షి టీవీషో’ బాగా ప్రాచుర్యం పొందింది. అగ్నిసాక్షిలో సంపత్‌ జె రామ్‌తో పాటు నటించిన విజయ్‌ సూర్య.. సంపత్‌ నటుడిగా మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడని తెలిపారు. కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలని కలలుగన్నాడన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.