Most Recent

Rashmika Mandanna: నా పేరెంట్స్ నన్ను చూసి గర్వపడటం లేదు.. ఎమోషనల్ అయిన రష్మిక

Rashmika Mandanna: నా పేరెంట్స్ నన్ను చూసి గర్వపడటం లేదు.. ఎమోషనల్ అయిన రష్మిక
Rashmika Mandanna

టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్‌లో తన సత్తా చాటుతోంది అందాల భామ రష్మిక మందన్న. కన్నడ లో కిరాక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగులో నాగ శౌర్య నటించిన చలో సినిమాతో పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గీతగోవిందం సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆతర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మిక దశ తిరిగింది. ఆ వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది ఈ శ్రీవల్లి. పుష్ప పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ అయ్యింది.

ఇక తమిళ్ లోనూ నటిస్తోంది ఈ క్యూటీ.. అలాగే బాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కానీ బాలీవుడ్ లో ఈ అమ్మడికి అనుకున్నంత సక్సెస్ కావడం లేదు. ఇప్పుడు ఈ చిన్నది పుష్ప 2 లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయం చెప్పుకొచ్చింది.

ఇప్పటికే హీరోయిన్ గా ఓ స్థాయికి వచ్చాను.. పలు అవార్డులు కూడా అందుకున్నాను.. కానీ నా పేరెంట్స్ మాత్రం నన్ను చూసి గర్వపడటం లేదు. దానికి కారణం వారికి సినిమా రంగం గురించి ఏమి తెలియక పోవడమే అని తెలిపింది. వృత్తి గురించి వారికి పూర్తిగా అవగాహన లేకపోయినా తనకు అవసరమైనదంతా చేసి పెడుతున్నారని తెలిపింది.అయితే కెరీర్ స్టార్టింగ్ లో తన తన తల్లిదండ్రులు పలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారని, వారు పడ్డ కష్టాలు తనకు తెలుసు అని ఎమోషనల్ అయ్యింది రష్మిక. అందుకే తన పేరెంట్స్ గర్వపడేలా మరింత సాధించాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.