Most Recent

Ram Charan: రామ్ చరణ్‌తో బుచ్చిబాబు అలాంటి సినిమా చేస్తున్నాడా..?

Ram Charan: రామ్ చరణ్‌తో బుచ్చిబాబు అలాంటి సినిమా చేస్తున్నాడా..?
Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్టార్ ను దాటి గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి అలరించారు చరణ్. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ గ్లోబల్ స్టార్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాకు పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో సినిమా చేస్తున్నారు చరణ్.

సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన బుచ్చిబాబు తన తొలి సినిమా ఉప్పెనతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఇప్పుడు చరణ్ తో బుచ్చిబాబు చేసే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా పై ఫిలిం సర్కిల్స్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని.. ఓ ప్రముఖ క్రీడాకారుడి బయోపిక్ గా ఈ సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తుంది. ఈవార్తలు పై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కానీ ఎవరి బయోపిక్ కాదు కానీ తెలిపింది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తో వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.